భార్యను చంపి ముక్కలు చేసి.. కుక్కర్‌లో ఉడికించిన భర్త..!

భార్యను చంపి ముక్కలు ముక్కలుగా చేసిన కసాయి భర్త - మృతదేహాన్ని ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడికించిన వైనం - భార్యతో విభేదాలే కారణం..

రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో దారుణం చోటు చేసుకుంది. భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడికించిన భర్త ఉదంతం కలకలం రేపింది.
HUSBAND KILLED THE WIFE.
ఈనెల 18న తన భార్య వెంకటమాధవి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులతో కలిసి భర్త గురుమూర్తి మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుసుకున్న పోలీసులు.. గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తానే భార్యను హత్య చేశానని అంగీకరించాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడికించానని, ఆ తర్వాత వాటిని జిల్లెలగూడ చెరువులో పడేసినట్టు తెలిపాడు. గురుమూర్తి చెప్పిన విషయాలపై ఆధారాలు సేకరించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. మృతదేహం ఆనవాళ్ల కోసం గాలింపు చేపట్టారు.

గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు. ప్రస్తుతం కంచన్‌బాగ్‌లో సెక్యూరిటీ గార్డ్డ్‌గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం వెంకటమాధవితో గురుమూర్తికి వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం. తూప్రాన్‌పేట్‌లోని దండుపల్లిలో నివాసముంటున్నారు. వెంకమాధవి మిస్సింగ్‌ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని మీర్‌పేట పోలీసులు తెలిపారు.

అసలు కథ ఇదే…!

సెక్యూరిటీ గార్డ్గా ఉద్యోగం : గురుమూర్తి గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు. ప్రస్తుతం కంచన్‌బాగ్‌లో సెక్యూరిటీ గార్డ్గా ఉద్యోగం చేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం వెంకటమాధవితో గురుమూర్తికి వివాహం అయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తూప్రాన్‌పేట్‌లోని దండుపల్లి పరిధిలో నివాసముంటున్నారు. వెంకటమాధవిపై మిస్సింగ్‌ కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని మీర్‌పేట సీఐ నాగరాజు మీడియాకు తెలిపారు..

అతడు ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్. సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన డీఆర్‌డీఓలో ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే హైదరాబాద్‌లోని మీర్‌పేట పరిధిలో తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన భార్యపై అనుమానం పెంచుకున్న ఆ రిటైర్డ్ ఆర్మీ జవాన్.. ఒకరోజు ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఆ తర్వాత ఆ ముక్కలను ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించాడు. ఆ ఉడికించిన ముక్కలను తీసుకెళ్లి.. ఎవరి కంటా పడకుండా చెరువులో పడేశాడు. ఆమె కనిపించడం లేదని.. భార్య తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. చివరికి విచారణ చేపట్టిన పోలీసులు.. భర్తే ఈ పని చేశాడని గుర్తించారు..

జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంటక మాధవి(35), ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఈనెల 13వ తేదీ నుంచి మాధవి కనిపించడం లేదని మీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు.. ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు..అయితే తన భార్యను చంపిన విషయాన్ని దాచిపెట్టిన గురుమూర్తి.. ఏమీ తెలియనట్లుగా అత్తామామలతో కలిసి మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేశాడు. అయితే ఈ వ్యవహారంపై విచారణ జరిపినన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. గురుమూర్తే తన భార్య మాధవిని అత్యంత దారుణంగా హత్య చేసినట్లు వెల్లడైంది. అయితే భార్యను చంపడానికి ముందు గురుమూర్తి ఒక కుక్కను చంపినట్లు పోలీసులు గుర్తించారు.

అయితే తన భార్యపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి.. ఒకరోజు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఆమెను అతి దారుణంగా నరికి చంపాడు. ఆ తర్వాత డెడ్‌బాడీని ముక్కలు ముక్కలుగా నరికి వేరు చేశాడు. ఆ తర్వాత ఆ ముక్కలను కుక్కర్‌లో ఉడకబెట్టి.. ఆ ముక్కలను జిల్లెల్లగూడలో ఉన్న చందన చెరువులో పడేశాడు. అనంతరం తనకేమీ తెలియదన్నట్లు ప్రవర్తించాడు. చివరికి మాధవి తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.