*సూర్యాపేట జిల్లా..
పరువు హత్య కేసును చేదించిన పోలీసులు..
ప్రేమ, కులాంతర వివాహమే కారణం..ఒక మహిళతో సహా మొత్తం 6 గురు నిందితులు.. అరెస్ట్.. రిమాండ్..
ఎర్టిగా కారు.. కత్తి, 5 మొబైల్స్ స్వాధీనం
పథకం ప్రకారమే 26 సాయంత్రం బైరు మహేష్ అనే వ్యక్తి వడ్లకొండ కృష్ణ (మాల బంటి)ని ఇంటినుంచి బయటకు తీసుకెళ్లాడు..
సూర్యాపేట శివారు ప్రదేశంలో భార్గవి అన్న కోట్ల నవీన్, తమ్ముడు కోట్ల వంశీ తో కలిసి చేతులు పట్టుకుని బండ రాళ్ళతో కొట్టి హత్య..
అనంతరం ఆమె తండ్రి కోట్ల సైదులు, నానమ్మ కు సమాచారం ఇచ్చారు..
డెడ్ బాడీ ని ఎర్టిగా కారులో తీసుకుని ముందుగా పాత సూర్యాపేట కు తీసుకెళ్లి నానమ్మ కోట్ల బుచ్చమ్మ కు చూపించారు..
అక్కడ నుంచి మృతదేహన్ని నల్లగొండ కు తీసుకెళ్లి నువ్వుల సాయిచరణ్ అనే స్నేహితునికి చూపగా భయంతో పారిపోయాడు..
తిరిగి మృతదేహన్ని మళ్ళీ సూర్యాపేట కు తీసుకువచ్చి పిల్లలమర్రి శివారులో మృతదేహన్ని అతని స్కూటీ పక్కన వదిలి వెళ్లిపోయారు.
విషయం తెలుసుకున్న పోలీసులు 6గురుని అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పటికే మూడుసార్లు హత్యకు యత్నించి విఫలమయ్యారు..
గతంలోనూ ఆరుగురు నిందితులతో పాటు మృతుడిపై కూడా పలు కేసులు ఉన్నట్లు SP సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు…