కొంతకాలంగా ఓ సామాజిక వర్గంపై దారుణ వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వివాదాస్పదంగా మారాడు. బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండగా…తాజాగా మరోసారి రెచ్చిపోయారు. ఆ సామాజికవర్గాన్ని కుక్కలతో పోల్చడంతో ఆ వర్గం మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని హైదరాబాద్ లో పోలీసులను ఆశ్రయించారు. వివాదాస్పదంగా మారిన తీన్మార్ మల్లన్నకు ఇది భారీ షాక్ తగిలింది..బీసీ ఉద్యమాన్ని ఆకస్మికంగా భుజానికి ఎత్తుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వరుసగా ఇతర సామాజికవర్గాలపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం జరిగిన ఓ సమావేశంలో మరోసారి మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెడ్డి సామాజికవర్గాన్ని దూషించారు. కుక్కలతో పోల్చడంతో వివాదాస్పదమైంది. అతడి వ్యాఖ్యలపై రెడ్డి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తీన్మార్ మల్లన్న నాలుక చీరుస్తాం’ అని రెడ్డి సంఘం మహిళలు హెచ్చరించారు. ఈ మేరకు మల్లన్నపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో రెడ్డి సంఘం మహిళలు ఫిర్యాదు చేశారు..రెడ్డి కులాన్ని రెడ్డి, రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడిన మల్లన్న తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రెడ్డి సంఘం మహిళలు డిమాండ్ చేశారు. గౌరవప్రదమైన పదవిలో ఉండి రెడ్డిలను కుక్కలతో పోల్చిన తీన్మార్ మల్లన్నపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. కులాల మధ్య కుంపట్లు, మతాల మధ్య మంటలు పెడుతున్న ఇలాంటి వారు నాయకులుగా ఉండడం సిగ్గుచేటని విమర్శించారు. ఇలా అనుచితంగా మాట్లాడే వాళ్లను కాంగ్రెస్ పార్టీ నుంచి వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్న ప్రతి మీటింగ్ లో ఇలానే రెడ్డిలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడని తెలిపారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.