పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ.. తెలంగాణ స్పీకర్‌కు సుప్రీం ప్రశ్నలు.. ఇంకెన్ని రోజులు కావాలి ..!.

తెలంగాణ (Telangana) లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court) లో శుక్రవారం విచారణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేసిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జార్జి మైస్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి…మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత ?..అంటూ తెలంగాణ స్పీకర్ ను నిలదీసింది. రీజనబుల్ టైమ్ అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకా ? అంటూ తెలంగాణ స్పీకర్ ను అడిగింది సుప్రీం కోర్టు.

The Supreme Court asked Telangana Speaker

దీంతో తెలంగాణ స్పీకర్‌ ను అడిగి నిర్ణయం చెపుతామన్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల పై బిఆర్ఎస్ వేసిన పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. పార్టీ ఫిరాయింపులు జరిగి పది నెలలు అవుతున్న స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదని అటు బీఆర్ఎస్ తరపున వాదనలు వినిపించారు లాయర్‌.

కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని… హైకోర్టు రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిందని తెలిపారు బీఆర్‌ఎస్‌ తరఫు లాయర్‌. రీజనబుల్ టైం అంటే ఎంత సమయం కచ్చితంగా టైం ఫ్రేమ్ ఉండాలని కోరారు బీఆర్ఎస్ తరపు లాయర్‌. అటు సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయింపుల పై విచారణ జరిగింది. బీఆర్ఎస్ పిటిషన్ పై జస్టిస్ బి ఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ విచారణ జరిపింది..