కేసీఆర్ కు నిలబడే పరిస్థితే లేదు.. ఇక బలంగా కొట్టే దమ్ముందా?…సీఎం రేవంత్.

తెలంగాణ ప్రజలు ఓడించి ఫామ్ హౌజ్కు పరిమితం చేసినా కేసీఆర్లో అహంకారం తగ్గలేదని CM రేవంత్ మండిపడ్డారు. ‘ఫామ్ హౌజ్లో ఉండి స్టోరీలు చెప్పొద్దు. అసెంబ్లీకి వస్తే ప్రభుత్వం ఏం చేస్తుందో చెబుదాం. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే గుమ్మికింద పందికొక్కుల్లా మిగులు బడ్జెట్ను మింగేశారు. అబద్ధాల వల్లనే గత అసెంబ్లీ ఎన్నికల్లో BRS ఓడిపోయింది. కేసీఆర్కు సరిగ్గా నిలబడే పరిస్థితే లేదు. ఇక బలంగా కొట్టే దమ్ము ఉందా?” అని ప్రశ్నించారు…

సోది చెప్పుడు కాదు.. అసెంబ్లీకి రా..

ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని సీఎం రేవంత్ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్దలో పర్యటించిన రేవంత్.. కేసీఆర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫామ్ హౌస్లో కూర్చొని వచ్చిన వారికి సోది చెప్పుడు కాదు.. అసెంబ్లీకి రా చర్చ పెడదామని సవాల్ విసిరారు. రూ.8లక్షలు అప్పులు చేసి దళిత బంధు ఎగ్గొట్టినావ్.. రైతు బంధు ఎగ్గొట్టినావ్ అని కేసీఆర్పై ధ్వజమెత్తారు..