*A.P & T.G Live Update News.
నేటి నుండి బసవతారకం ఆస్పత్రిలో ఉచిత క్యాన్సర్ టెస్టులు*
హైదరాబాద్ :
* ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ టెస్టులు చేయనున్నారు.
* నేడు ఫిబ్రవరి 04-28 వరకు ఉచిత క్యాంప్ కొనసాగుతుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
* ఉ.10 నుంచి మ.1 గంట వరకు ఉచితంగా ప్రైమరీ టెస్టులు, ఆ తర్వాత అవసరమైన పరీక్షలను తక్కువ ధరకు చేయనున్నట్లు పేర్కొన్నాయి
* క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు సేవలు ఉపయోగించు కోవాలని సూచించారు..
*_ఫిబ్రవరి మొదటివారంలోనే మండుతున్న ఎండలు..!!_*
– హైదరాబాద్: రాష్ట్రంలో ఫిబ్రవరి మొదటివారంలోనే ఎండలు మండుతున్నాయి. చలి తీవ్రత తగ్గడంతో నిన్న ఆదిలాబాద్, మహబూబ్ నగర్లో 36.5, భద్రాచలంలో 35.6, మెదక్లో 34.8, హైదరాబాద్లో డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
–
రాబోయే రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు…
తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు
TG: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై రెడ్డి సంఘాల నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల వరంగల్ బీసీ బహిరంగ సభలో రెడ్డిలను తీవ్ర పదజాలంతో దూషించారని, వెంటనే మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు. ‘రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ సీటుతో మల్లన్నకు భిక్ష పెట్టారు. మా ఓట్లు పనికిరావని అప్పుడెందుకు చెప్పలేదు? బీసీల కోసం పోరాడటంలో తప్పులేదు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు?’ అని మండిపడ్డారు…
తీన్మార్ మల్లన్న ఇతర కులాలను దూషించడం సరికాదు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తీన్మార్ మల్లన్నకు బీ ఫారం ఇచ్చి గెలిపించుకున్నామన్న మంత్రి
జిల్లాకు మంత్రిగా ఉన్న నేను… పార్టీ అభ్యర్థి ఓడిపోవాలని కోరుకుంటానా? అని ప్రశ్న
వ్యక్తిగతంగా విమర్శిస్తే పట్టించుకోనని, ఒక కులాన్ని దూషించడం సరికాదన్న మంత్రి
తీన్మార్ మల్లన్న బీసీ సభను ఏర్పాటు చేసి ఇతర కులాలను దూషించడం సరికాదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బీసీ సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేను తప్పుబట్టారు. ఒక సామాజిక వర్గం బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా చేస్తోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు.
గెలుపోటములను నిర్ణయించేది వ్యక్తులు కాదని, ప్రజలని గుర్తించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తీన్మార్ మల్లన్న గెలుపు కోసం పని చేశామన్నారు. భారీ ర్యాలీ నిర్వహించి, అన్ని వర్గాలను మెప్పించి అతనిని గెలిపించుకున్నామని మంత్రి తెలిపారు. తాను జిల్లాకు మంత్రిగా ఉండి పార్టీ నుండి పోటీకి దింపి, అతను ఓడిపోవాలని కోరుకుంటానా? అని ప్రశ్నించారు. బీసీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ మంచి నిర్ణయం తీసుకుందన్నారు.
కాంగ్రెస్ బీ ఫారంపై పోటీ చేసి గెలిచిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు అదే ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వ్యక్తిగతంగా తనను విమర్శిస్తే పట్టించుకోనని, కానీ ఒక కులాన్ని దూషిస్తే ఏమాత్రం సహించేది లేదని అన్నారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు ఉన్న ఆస్తులు ఎన్నో చెప్పాలంటే ఓ పుస్తకమే రాయాలని ఎద్దేవా చేశారు. కుల గణన సర్వేలో కవిత మినహా కేసీఆర్ కుటుంబం పాల్గొనలేదన్నారు. ఎస్సీ వర్గీకరణ, కుల గణనపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. కేంద్రం అంగీకరిస్తే ఫర్వాలేదని, లేకుంటే తమ పార్టీ మాత్రం రిజర్వేషన్లను అమలు చేస్తుందని తెలిపారు..
తెలంగాణ సచివాలయాన్ని పేల్చి వేస్తానని బెదిరింపులు
తెలంగాణ సెక్రటేరియట్ ను పేల్చి వేస్తానని బెదిరింపులు
మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తున్న లంగర్ హౌజ్ కు చెందిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీ
దర్గాకు సంబంధించి ఓ సమస్య పై ప్రభుత్వానికి తాను అర్జి పెట్టుకున్నానని, అధికారులు స్పందించక పోవడంతో అధికారులకు బెదిరింపులు
ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులో తీసుకొని విచారించిన ఎస్పీఎఫ్ పోలీసులు
పోలీసులు, సెక్రటేరియట్ అధికారులతో వాగ్వాదానికి దిగిన ఫోన్ చేసిన వ్యక్తి
ఎందుకు ఫోన్ చేశాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న సైఫాబాద్ పోలీసులు..
వికసిత్ భారత్ మా లక్ష్యం… ప్రధాన మోడీ..
లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగం..
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం..
నాలుగోసారి దేశప్రజలు నన్ను ఆశీర్వదించారు.
21వ శతాబ్దంలో 25 శాతం గడిచిపోయింది
వికసిత్ భారత్ మా లక్ష్యం.
10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారు
పేదలు, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాం.
ఐదేళ్లలో 12 కోట్ల మందికి తాగునీటి వసతి కల్పించాం
4 కోట్ల మంది పేదలకు గృహ వసతి కల్పించాం.
రాహుల్పై మోదీ సెటైర్లు
కొందరు నేతలు పేదలతో ఫొటో సెషన్ చేస్తారు
పార్లమెంట్లో పేదలపై చర్చలో మాత్రం పాల్గొనరు.
మేం బూటకపు హామీలు ఇవ్వలేదు..
పేదల కోసం 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు కట్టించాం
డిజిటల్ లావాదేవీలతో పారదర్శకత తీసుకొచ్చాం
స్వచ్ఛ్ భారత్ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం..
చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాం..
అశ్లీల వీడియోల పేరుతో సాఫ్ట్వేర్ ఉద్యోగినిని బెదిరించి రూ.2.53 కోట్లు కాజేసిన స్నేహితురాలి భర్త.
నిడదవోలు పట్టణానికి చెందిన యువతి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కూకట్పల్లిలో హాస్టల్లో నివసిస్తుంది
అదే హాస్టల్లో చిన్ననాటి స్నేహితురాలు కాజా అనుషా దేవి పరిచయం అయింది. అనుషా దేవి భర్త నినావత్ దేవానాయక్ అలియాస్ మధు సాయి కుమార్ ను కూడా పరిచయం చేసింది..
ఉద్యోగం లేక జల్సాలకు అలవాటు పడ్డ దేవనాయక్.. భార్య స్నేహితురాలైన బాధితురాలిని టార్గెట్ చేశాడు
ఫోనులో వేరే సిమ్ కార్డు వేసుకొని బాధితురాలికి ఫోన్ చేసి.. నీ న్యూడ్ వీడియోలు ఉన్నాయి ఇంటర్నెట్లో పెడతానని బెదిరించడం ప్రారంభించాడు
తానే బెదిరిస్తున్నాడని తెలియక బాధితురాలు ఈ విషయాన్ని దేవనాయక్ కు చెప్పింది. ఆ విషయం సెటిల్ చేస్తానని.. కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని, అనేక సాకులు చెప్పి రూ.2,53,76,000 తీసుకున్నాడు
మోసపోయానని గ్రహించిన బాధితురాలు నిడదవోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది
నిందితుడు దేవానాయక్ను అరెస్టు చేసిన పోలీసులు రూ.1,81,45,000 స్వాధీనం చేసుకున్నారు…
నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు: వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం.
ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంను కిడ్నాప్ చేశారంటూ వైసీపీ నేతల ఆరోపణ
అనారోగ్యం కారణంగా తాను ఆసుపత్రిలో ఉన్నానన్న సుబ్రహ్మణ్యం
వదంతులు సృష్టించవద్దని విన్నపం
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు కాసేపట్లో జరగనున్నాయి. మరోవైపు, నిన్న రాత్రి నుంచి వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం కనిపించడం లేదని, ఆయనను కిడ్నాప్ చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఫోన్ లో కూడా ఆయన అందుబాటులో లేరని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం స్పందించారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు. అనారోగ్యం కారణంగా తాను ఆసుపత్రిలో చేరానని, తనను కిడ్నాప్ చేశారంటూ వదంతులను సృష్టించవద్దని కోరారు..
అమెరికాలో ఆఫ్లైన్లోకి వందలాది ప్రభుత్వం వెబ్సైట్లు.
అమెరికాలో ఆఫ్లైన్లోకి వందలాది ప్రభుత్వం వెబ్సైట్లు
అమెరికాలోని యూఎస్ఎయిడ్లో వందలాది గవర్నమెంట్ వెబ్సైట్లు ఆఫ్లైన్లోకి వెళ్లినట్లు ఏఎఫ్పీ ప్రకటించింది. దీంతో సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ రూపొందించిన 1,400 ఫెడరల్ సైట్ల జాబితాలో దాదాపు 350 కంటే ఎక్కువ వెబ్సైట్లు అందుబాటులో లేవని పేర్కొంది. అయితే ఇవి తాత్కాలికంగా ఆఫ్లైన్లోకి వెళ్లాయా లేదా ట్రంప్ ఆదేశాల మేరకు పూర్తిగా మూసివేశారా అనే విషయం తెలియాల్సి ఉంది..
13 పైసలు పడిపోయిన రూపాయి విలువ
13 పైసలు పడిపోయిన రూపాయి విలువ
అంతర్జాతీయ మార్కెట్లో భారత కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. ఇవాళ 13 పైసలు తగ్గిన రూపాయి.. అమెరికా డాలరుతో పోలిస్తే రూ.86.98 తక్కువగా ఉంది. రూపాయి క్షీణతలో ఇది అత్యధిక రికార్డు. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలపై తాత్కాలిక విరామం ప్రకటించిన తర్వాత 109.88 స్థాయిని దాటి పెరిగిన US డాలర్ ఇండెక్స్ 108.74కి తగ్గిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు.
అసెంబ్లీలో 42శాతం రిజర్వేషన్లు బిల్లు పెడుతరేమో అనుకున్నం : కేటీఆర్.
ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే.. 42శాతం రిజర్వేషన్ల బిల్లు పెడుతున్నరేమో అనుకున్నామని.. చివరకు ఏదో సర్వే రిపోర్ట్ని పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు..అసెంబ్లీలో బీసీ కుల గణన నివేదికపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి చారిత్రాత్మకమైన ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో కామారెడ్డి డిక్లరేషన్ తరహాలో 42శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి బిల్లు ప్రవేశపెడతారేమోనని.. ఆ బిల్లును శాసనసభలో ఆమోదింప చేసి.. చట్టబద్ధత కల్పిస్తారేమోనని రాష్ట్రవ్యాప్తంగా బలహీన వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. కానీ, ముఖ్యమంత్రి లేచి నాలుగు పేర్లు చదువుతున్నారు. మీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే రేవంత్రెడ్డి గారు మీరే చెప్పారు’ అంటూ విమర్శించారు. .కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నడు. మీరిచ్చిన నివేదికను తగలబెట్టాలని చెబుతున్నడు. శాసనసభ సమావేశం ప్రత్యేకంగా పెడితే.. ఇవాళ మీరేం కొత్తగా ఏం చెప్పారు. మీరు చెప్పిందే మొన్న ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రెస్మీట్లో చెప్పారు. సబ్కమిటీ చైర్మన్గా చెప్పిన లెక్కలన్నీ.. సీఎం ఇవాళ చెప్పారు. ఎందుకు ఇవాళ సభ పెట్టారు? 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తెస్తారని మేం అనుకున్నాం. మీరు చెప్పినట్లు 56శాతం బీసీలు ఉంటే.. వారికి బీసీ సబ్ ప్లాన్ తెస్తరేమోనని అనుకున్నాం. ఏమీ తేకుండా.. ఇవాళ నివేదికన సభలో పెట్టామంటే.. చరిత్ర అని చెప్పుకుంటే కాదు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని’ కేటీఆర్ డిమాండ్ చేశారు.
ప్యాకేజీ స్టార్ తీన్మార్ మల్లన్న : కే.ఏ.పాల్.
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ప్యాకేజీ స్టార్ట్స్ షర్మిల, పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు ఒకడు కొత్తోడు(New Package Star) వచ్చాడని..అతడే తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)అని ప్రజాశాంతి అధ్యక్షుడు కే.ఏ.పాల్(Public Peace President K.A. Paul)విమర్శించారు..మీడియా సమావేశంలో మాట్లాడిన కే.ఏ.పాల్ తీన్మార్ మల్లన్నపై, ఎంపీ ఆర్.కృష్ణయ్యపై విమర్శలు గుప్పించారు. తీన్మార్ మల్లన్నపై ఎన్నో రౌడీ షీట్ కేసులు ఉన్నాయని పాల్ ఆరోపించారు. నేను బీసీని అంటూ 80కోట్లు ఖర్చు పెట్టి కృష్ణయ్యతో కలిసి నిన్న బీసీ మీటింగ్ పెట్టాడని..బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. కృష్ణయ్య మేం బిక్షగాళ్లమా అంటూ టీడీపీ, వైసీపీ, బీజేపీలకు బీసీలను తాకట్టుపెట్టి పదవులు పొందాడని పాల్ మండిపడ్డారు. కృష్ణయ్య శిష్యుడే తీన్మార్ మల్లన్న అని..దానికి రుజువే నిన్న బీసీ మీటింగ్ అని పాల్ ఆరోపించారు.
కాగా ఇటీవల బీసీ నినాదం ఎత్తుకున్న తీన్మార్ మల్లన్న సొంత పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే తప్పుల తడకగా విమర్శలు చేసి సంచలనం రేపాడు. ప్రభుత్వంతో పలు అంశాలపై విభేదిస్తున్న మల్లన్న తరుచు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. బీసీల సంఘటితం కోసమంటూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో రెడ్డి సామాజిక వర్గం లక్ష్యంగా మల్లన్న చేస్తున్న విమర్శలు సొంత పార్టీ ప్రజాప్రతిధుల నుంచి కూడా విమర్శలకు గురువుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా కులగణనకు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బీసీల కోసం గళమెత్తుతున్న మల్లన్న పై ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా అన్నది ప్రశ్నగా మారింది. తన బీసీ నినాదంతో దూకుడుగా వ్యవహరిస్తున్న మల్లన్న మునుముందు ఇంకేం చేయబోతాడన్నది కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి కరంగా మారింది..