నన్నే చూసే నీ చూపులేే సాక్షిగా…!

ఇప్పుడే మెలమెల్లగా సూర్యోదయం
చూస్తూవున్నా సరికొత్తగా
ప్రేమగా నన్నే చూసే
నీ చూపులేే సాక్షిగా🌹💕

ఇపుడే నీ ఊహల్లోంచి
ఈ లోకంలోకి వచ్చానుగా
తీగలా నన్నే అల్లె
నీ ఊపిరే ప్రేమగా🌹💕

ఎప్పుడో నీ కోసమే
నిరీక్షించా నిట్టూర్పుగా
రోజాపూల మాలతో సుస్వాగతం చెప్తావనే ఆశగా🌹💕

కనులే రాసే ప్రియలేఖ
చెలిమే చూపే చిరునామా🌹💕

మనసారా నిన్నే కోరి
నిన్నే చేరి…… నీలా మారి
నీతో నడిచే ఏకాంతంలో🌹💕

కనుల నిండా కురిసే
పున్నమి వెన్నెల జల్లు
పెదవుల్లో విరిసే
అందమైన చిరునవ్వు🌹💕