రోహిత్ శర్మ శతకం తో సిరీస్ టీమిండియా కైవసం!

ఇంగ్లాండ్ 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, రోహిత్ శర్మ సెంచరీతో భారత్ 2వ వన్డేలో ఘన విజయం సాధించింది. చివరి 10 ఓవర్లలో భారత్ గెలవడానికి కేవలం 30 పరుగులు మాత్రమే అవసరం, కానీ 40వ మరియు 41వ ఓవర్లలో వారు తమ చివరి నాలుగు వికెట్లకు అకస్మాత్తుగా తగ్గుముఖం పట్టడంతో వికెట్లు కోల్పోయారు. రవీంద్ర జడేజా చివరికి ఫోర్ తో దాన్ని ముగించాడు మరియు భారతదేశం నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఆతిథ్య జట్టు రబ్బరులో 2-0 ఆధిక్యాన్ని కూడా సాధించింది, తద్వారా వారు తమ కోసం సిరీస్ విజయాన్ని నిర్ధారించుకున్నారు..

పాకిస్థాన్ పవర్ హిట్టర్ షాహిద్ అఫ్రిది వన్డేల్లో 351 సిక్సులతో అగ్ర స్థానంలో ఉన్నాడు. రోహిత్ మరో 17 సిక్సులు కొడితే వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే 305 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 86 పరుగులు చేసింది. క్రీజ్ లో ఓపెనర్లు గిల్ (34), రోహిత్ శర్మ(54) క్రీజ్ లో ఉన్నారు. అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్.. బ్యాటర్లు అందరూ సమిష్టిగా రాణించడంతో 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది..

కటక్‌లో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్‌ నిర్దేశించిన 305 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఓపెనర్‌గా దిగిన రోహిత్‌,.. సొగసైన ఇన్నింగ్స్‌ ఆడాడు. శుభ్‌మన్‌ గిల్‌(60; 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత గిల్‌ తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి(5) మరోసారి విఫలమయ్యాడు. రోహిత్‌ సెంచరీ చేసే సమయానికి టీమిండియా ఇంకా 119 పరుగులు చేయాల్సింది ఉంది. రోహిత్‌కు జతగా శ్రేయస్‌ అయ్యార్‌ క్రీజ్‌లో ఉన్నాడు. ఇది రోహిత్‌కు 32వ వన్డే శతకం.

అంతకుముందు టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌(26), బెన్‌ డకెట్‌(65)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత సాల్ట్‌ తొలి ివికెట్‌ గా పెవిలియన్‌ చేరాడు. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్‌ ఇచ్చి సాల్ట్‌ ఔటయ్యాడు. అనంతరం జో రూట్‌ తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందకు తీసుకెళ్లాడు డకెట్‌. అయితే వీరి భాగస్వామ్యం ఎంతో సేపో ినిలవలేదు. డకెట్‌ను రవీంద్ర జడేజా పెవిలియన్‌ కు పంపాడు.

ఆపై బ్రూక్‌(31), జాస్‌ బట్లర్‌(34)లు కాస్త ఫర్వాలేదనిపించారు. జో రూట్‌ 72 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్‌,ను చక్కదిద్దాడు. ఆఖరి ఓవర్‌ వరకూ లివింగ్‌స్టోన్‌(41) ఉండటంతో ఇంగ్లండ్‌ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, షమీ, హర్షిత్‌ రానా, హార్దిక్‌ పాండ్యా, వరుణ్‌ చక్రవర్తిలకు తలో వికెట్‌ దక్కింది.

కటక్‌లో ఎండ వేడిమితో ప్రేక్షకులకు ఇబ్బంది..

6 సంవత్సరాల తర్వాత ఈ మ్యాచ్ ఆడటానికి భారత జట్టు కటక్ చేరుకుంది. చాలా కాలం తర్వాత తమ అభిమాన ఆటగాళ్లను చూసే అవకాశం అభిమానులకు లభించింది. సహజంగానే, ఇందు కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు స్టేడియంకు చేరుకున్నారు. నివేదిక ప్రకారం, కటక్‌లో జరిగిన మ్యాచ్‌ను చూడటానికి దాదాపు 35-40 వేల మంది అభిమానులు వచ్చారు. కానీ, ఈ మ్యాచ్ చూస్తున్నప్పుడు వేడి కారణంగా వాళ్లంతా ఇబ్బంది పడ్డాడు. కటక్‌లో ఉష్ణోగ్రత దాదాపు 34 డిగ్రీలు ఉండటంతో ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అందువల్ల, స్టేడియం యాజమాన్యం అభిమానులకు వేడి నుంచి ఉపశమనం కలిగించడానికి వారిపై నీటిని చల్లాలని నిర్ణయించింది…

హిట్‌మ్యాన్‌ సూపర్‌ షో..
చాలాకాలం తర్వాత బ్యాటింగ్‌లో చెలరేగిన రోహిత్‌.. సెంచరీతో మెరిశాడు. గత కొంతకాలంగా ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న హిట్‌ మ్యాన్‌.. తిరిగి సత్తా చాటాడు. తనపై వరుసగా వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాదానం చెప్పాడు రోహిత్‌. 76 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో తనదైన శైలిలో రెచ్చిపోయి శతకం పూర్తి చేసుకున్నాడు. సిక్స్‌ కొట్టి సెంచరీ పూర్తి చేయడం విశిషం. ఇది రోహిత్‌కు 18 నెలల తర్వాత వన్డేల్లో తొలి సెంచరీ. 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 119 పరుగులు చేశాడు రోహిత్‌. ఇది రోహిత్‌కు 32వ వన్డే శతకం.

కోహ్లి విఫలం..
శుభ్‌మన్‌ గిల్‌(60; 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) తో కలిసి భారీ ాభాగస్వామ్యాన్ని నెలకొల్పాడు రోహిత్‌. ఈ జోడి తొలి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత గిల్‌ తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి(5) మరోసారి విఫలమయ్యాడు. 8 బంతుల్లో ఒక ఫోర్‌ కొట్టిన అనంతరం ‍కోహ్లి ెపెవిలియన్‌ బాట పట్టాడు. ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో ాసాల్ట్‌ుకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు ివిరాట్‌.

ఆకట్టుకున్న అయ్యర్‌
కోహ్లి ఔటైన తర్వాత సెకండ్‌ డౌన్‌లోక్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ ఆకట్టుకున్నాడు. రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. ఒకవైపు రోహిత్‌ దూకుడుగా ఆడుతుంటే అయ్యర్‌.. స్ట్రైక్‌రొటేట్‌ చేస్తూ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడి 70 పరుగులు జోడించిన తర్వాత రోహిత్‌ మూడో వికెట్‌గా ఔటయ్యాడు.లివింగ్‌ స్టోన్‌ బౌలింగ్‌ లో భారీ షాట్‌ ఆడబోయి రషీద్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో 220 పరుగుల వద్ద రోహిత్‌ రూపంలో టీమిండియా మూడో వికెట్‌ ను కోల్పోయింది. రోహిత్‌ ఔటైన స్వల్ప వ్యవధిలోనే అయ్యర్‌ సైతం పెవిలియన్‌ చేరాడు. 47 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 44 పరుగులు చేసిన అయ్యర్‌..రనౌట్‌ అయ్యాడు.

నిరాశపరిచిన రాహుల్‌.. మెరిసిన అక్షర్‌
ఫోర్త్‌ డౌన్‌ లో బ్యాటింగ్‌ కు వచ్చిన కేఎల్‌ రాహుల్‌ మరోసారి నిరాశపరిచాడు. 14 బంతుల్లో 1 ఫోర్‌ సాయంతో 10 పరుగులు చేసిన రాహుల్‌.. జెమీ ఓవర్టాన్‌ బౌలింగ్‌ లో సాల్ట్‌ కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అక్షర్‌ పటేల్‌ మాత్రం బ్యాటింగ్‌ లో మెరిశాడు. ఆడపా దడపా షాట్లుకొడుతూ నిలకడగా బ్యాటింగ్‌ చేశాడు. 43 బంతుల్లో 4 ఫోర్లతో41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు అక్షర్‌.

అంతకుముందు టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌(26), బెన్‌ డకెట్‌(65)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత సాల్ట్‌ తొలి ివికెట్‌ గా పెవిలియన్‌ చేరాడు. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్‌ ఇచ్చి సాల్ట్‌ ఔటయ్యాడు. అనంతరం జో రూట్‌ తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందకు తీసుకెళ్లాడు డకెట్‌. అయితే వీరి భాగస్వామ్యం ఎంతో సేపో నిలవలేదు. డకెట్‌ను రవీంద్ర జడేజా పెవిలియన్‌ కు పంపాడు.

ఆపై బ్రూక్‌(31), జాస్‌ బట్లర్‌(34)లు కాస్త ఫర్వాలేదనిపించారు. జో రూట్‌ 72 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్‌,ను చక్కదిద్దాడు. ఆఖరి ఓవర్‌ వరకూ లివింగ్‌స్టోన్‌(41) ఉండటంతో ఇంగ్లండ్‌ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, షమీ, హర్షిత్‌ రానా, హార్దిక్‌ పాండ్యా, వరుణ్‌ చక్రవర్తిలకు తలో వికెట్‌ దక్కింది.