లేటెస్ట్ 15 న్యూస్ అప్డేట్స్..!

పొట్టి దుస్తులు ధరించడం నేరం కాదు: ఢిల్లీ కోర్టు

పొట్టి దుస్తులు ధరించడం నేరం కాదు: ఢిల్లీ కోర్టు
పొట్టి దుస్తులు ధరించడంపై ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది బార్‌లో అశ్లీల నృత్యం చేసిన పలువురు బార్ డ్యాన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు పొట్టి దుస్తులు ధరించి డ్యాన్సులు చేయడం నేరం కాదని ఏడుగురు బార్ డ్యాన్సర్లను నిర్దోషులుగా ప్రకటించింది. డ్యాన్స్ వల్ల ప్రజలకు చిరాకు కలిగిస్తేనే చర్యలు తీసుకోవచ్చని తీర్పు చెప్పింది..

కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

TG: పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయమని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇవాళ ఎర్రవల్లి ఫామ్హహౌస్లో కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం మాట్లాడుతూ స్టేషన్ ఘన్పూర్లోనూ ఉపఎన్నిక వస్తుందని కడియం శ్రీహరి ఓడిపోయి రాజయ్య గెలుస్తారని జోస్యం చెప్పారు. ఉపఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు..

బర్డ్‌ఫ్లూపై అప్రమత్తమైన తెలంగాణ సర్కార్.

బర్డ్‌ఫ్లూపై అప్రమత్తమైన తెలంగాణ సర్కార్
బర్డ్‌ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను అధికారులు వెనక్కి పంపుతున్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులు చికెన్ తినవద్దని, జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది..

యుద్ధ విమానాన్ని నడిపిన కేంద్ర మంత్రి.

యుద్ధ విమానాన్ని నడిపిన కేంద్ర మంత్రి
విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు యుద్ధ విమానాన్ని నడిపారు. హెచ్ఏఎల్ స్వదేశంలో తయారు చేసిన హెచ్ జేటీ-36 ‘యశస్’ జెట్ విమానాన్ని ఆయన నడిపారు. బెంగళూరులోని యలహంకలో ద్వైవార్షిక ఏరో ఇండియా సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రి యుద్ధ విమానాన్ని నడిపి ఆనందం వ్యక్తం చేశారు..

చత్తీస్గఢ్లో మావోయిస్టుల హింస 47% తగ్గింది: కేంద్రం.

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల హింసాత్మక కార్యక్రమాలు 2010 నాటితో పోలిస్తే 47% తగ్గినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించింది. 2024లో మావోయిస్టుల గ్రూపుల హింసాకాండలో పౌరులు, భద్రతా సిబ్బంది మృతుల సంఖ్య కూడా 64% తగ్గినట్లు తెలిపారు. 2024లో వామపక్ష తీవ్రవాదం కేసులు 267 నమోదు అయ్యాయని.. 2010లో ఆ సంఖ్య 499గా ఉన్నట్లు వెల్లడించారు. పౌరులు, భద్రతా దళాల సంఖ్య 2010లో 343 ఉండగా, గతేడాది ఆ సంఖ్య 122కు తగ్గినట్లు తెలిపారు..

మహా కుంభమేళ.. 45 కోట్ల మంది పుణ్యస్నానాలు

సనాతన ఆధ్యాత్మిక అతిపెద్ద పండుగ మహా కుంభమేళా. 144 ఏళ్లకు వచ్చే ఈ పండుగ ఘనమైన రికార్డును సొంతం చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం సమయానికి ప్రయాగ్ రాజ్ త్రివేణీ సంగమంలో 45కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. బుధవారం పవిత్రమైన మాఘ పౌర్ణమి కావడం, శివరాత్రి వరకు సమయం ఉండటంతో ఈ సంఖ్య సునాయాసంగా 50 కోట్లకు చేరే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత రద్దీని బట్టి ఈ సరికొత్త రికార్డు సాదిస్తుందని అంచనా వేస్తున్నారు..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలను ఖండించిన బోయినపల్లి వినోద్ కుమార్

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలవరు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండటానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవు

ఇదివరకు కూడా బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియకు బ్రిటిష్ కాలం నాటి పద్ధతులు అమల్లో ఉన్నాయి.. అవి మార్చాలి – మాజీ బీఆర్ఎస్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్…

ఆన్ లైన్ ఛీటింగ్ కేసులో లక్ష్మిపై ఆరోపణలు

కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ ఛీటింగ్ కేసులో లక్ష్మిపై ఆరోపణలున్నాయి. ఇదే కేసులో ఆమెను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి వస్తున్న సమయంలో ఆమెను అరెస్ట్ చేశారు. లక్ష్మిని ఎస్ వీ యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. లక్ష్మీపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు స్థానిక పోలీసులకు సమర్పించి అక్కడి నుంచి లక్ష్మిని రాజస్థాన్ కు తీసుకెళ్లారు. తిరుపతి నుంచి చెన్నైకు అక్కడి నుంచి రాజస్థాన్ కు తీసుకెళ్లనున్నారు..కిరణ్ రాయల్ పై ఆరోపణల నేపథ్యంలో లక్ష్మికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు మీడియా ప్రసారం చేసింది. లక్ష్మి బాధితుడు ఒకరు మీడియాలో ఆమె ఫోటో చూసి రాజస్థాన్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో రాజస్థాన్ పోలీసులు తిరుపతికి వచ్చి ఆమెను అరెస్ట్ చేశారు. ఆర్ధిక లావాదేవీలు, ఇతర వివాదాలపై కిరణ్ రాయల్ పై లక్ష్మీ ఆరోపణలు చేశారు.తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు. కిరణ్ రాయల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆరోపించారు.కిరణ్ రాయల్ తన నుంచి కోటి రూపాయాలు అప్పుగా తీసుకొని ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. తన డబ్బులు ఇవ్వాలంటే బెదిరిస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఈ ఆరోపణలతో కిరణ్ రాయల్ ను జనసేన వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ ఆదేశించింది.

చిరంజీవి సంచలన ప్రకటన

ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటానని ‘బ్రహ్మా ఆనందం’ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ఇకపై కళామతల్లి సేవలోనే గడిపేస్తానని తెలిపారు. రాజకీయ పెద్దలను కలిసేది పాలిటిక్స్ కోసమేనంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని, కానీ తాను సినీ రంగానికి అవసరమైన సహకారం కోసమే కలుస్తున్నానని స్పష్టం చేశారు. తన లక్ష్యాలు, సేవాభావాన్ని పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారని చిరంజీవి వెల్లడించారు..

మెట్రో రైలు నిర్మాణాన్ని పాతబస్తీలో చేపట్టడానికి వీలు లేదు..

హైదరాబాద్ నగరానికి మణిహారమైన మెట్రో రైలు నిర్మాణాన్ని పాతబస్తీలో చేపట్టడానికి వీలు లేదంటూ ఓ సంస్థ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా పాత బస్తీ మీద నుంచి వెళుతున్న మెట్రో మార్గాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఓల్డ్ సిటీలోని అనేక చారిత్రక కట్టడాలు ఈ ప్రాజెక్టు కారణంగా దెబ్బతింటాయని, వాటిని సంరక్షించాల్సిన ప్రభుత్వం.. మెట్రో పేరుతో నష్టపరుస్తోందంటూ ఆరోపించింది…

డంపింగ్ యార్డు ఇష్యూ.. గేదెలతో వినూత్న నిరసన ….

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లపల్లి, ప్యారా నగర్ గ్రామాల శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే ఈ డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ నల్లపల్లి గ్రామస్థులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపైకి పెద్ద ఎత్తున గేదెలను తీసుకొచ్చి ‘డంపింగ్ యార్డ్ వద్దు.. మా కడుపు కొట్టొద్దు’ అని ర్యాలీ నిర్వహించారు….

వర్గీకరణలో న్యాయపరమైన చిక్కులు లేకుండా చేశాం: సీఎం రేవంత్‌రెడ్డి –

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సిఫారసులను శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కలిశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాదిగ ఉపకులాల ప్రతినిధులతో కలిసి సీఎంతో సుమారు రెండు గంటలపాటు సమావేశమయ్యారు.

ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేశాం : ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై అసెంబ్లీలో చర్చించామని గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మేలు చేస్తామని, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేసే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు. కేబినెట్ సబ్‌కమిటీ, న్యాయకమిషన్ వేసి అధ్యయనం చేయించామని, వేగంగా నివేదిక తీసుకుని, కేబినెట్‌లో చర్చించి, అసెంబ్లీలో ప్రవేశపెట్టామని తెలిపారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేశామని అన్నారు.

కొన్ని లోపాలున్నాయి : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలకు మందకృష్ణ మాదిగ ధన్యవాదాలు తెలిపారు. సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు..

ఎస్సీ కుల్లాల్లో అత్యధికంగా 62 శాతం జనాభా ఉన్న మాదిగలను రిజర్వేషన్ శాతంలో అన్యాయం జరిగిందన్నారు. ఎస్సీ జనాభాలో రెండో స్థానంలో ఉన్న మాలలను జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ శాతం రిజర్వేషన్ కేటాయించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తరహాలోనే ఏబీసీడీ వర్గీకరణ చేయాలని, చేవెళ్ల డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లు ఎస్సీ వర్గీకరణను 15 నుంచి 18 శాతం పెంచి వెంటనే అమలు చేయాలని మందకృష్ణ సీఎంను కోరారు. ఎస్సీ వర్గీకరణలో ఉన్న లోటుపాట్లను రేవంత్ రెడ్డి సరిదిద్దుతారని భావిస్తున్నామని ఆయన అన్నారు..