తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి.. మాజీ సీఎం కేసీఆర్.కీల‌క వ్యాఖ్య‌లు..!

తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓటమి తప్పదని ఆయన స్పష్టం చేశారు. తాడికొండ రాజయ్య మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తారన్నారు.

ఈ నెల 15న తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి సుమారు వెయ్యి మందితో చేరికల కార్యక్రమం చేపట్టనున్నట్లు సమాచారం..

మంగళవారం సిద్దిపేట జిల్లా చింతమడకలోని ఫామ్ హౌస్‌లో సీఎం కేసీఆర్‌తో మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యతో పాటు ఆయన అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు…ఈ సందర్భంగా గులాబీ కండువా కప్పి.. వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ది చెబుతారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉపఎన్నికలు ఖాయని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్‌లో రాజయ్యతోపాటు చేరిన వారిలో కీర్తి వెంకటేశ్వర్లు, మల్కిరెడ్డి రాజేశ్వర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు..