అయోధ్యలోని సరయూ నదిలో ఇవాళ ఆచార్య సత్యేంద్ర దాస్(Acharya Satyendra Das) పార్దీవదేహాన్ని జలసమాధి చేశారు. రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే..అంతకుముందు గోపాల్ ఆశ్రమంలో ఆయన పార్దీవదేహాన్ని ఉంచారు. అంతిమయాత్రలో సాధువులు, రామభక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 3న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో 85 ఏళ్ల దాస్ను లక్నోలోని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎస్జీపీజీ)లో చేర్చారు. తన 20వ ఏట సన్యాస దీక్ష తీసుకున్న సత్యేంద్ర దాస్ 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో రామ జన్మభూమి ఆలయ పూజారిగా ఉన్నారు….
చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. 85 ఏళ్ల ఆచార్య సత్యేంద్ర దాస్ డయాబెటిస్, రక్తపోటుతో కూడా బాధపడుతున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ”అయోధ్య రామ్ మందిరం ప్రధాన పూజారి సతేంద్ర దాస్ ఈరోజు తుది శ్వాస విడిచారు. ఫిబ్రవరి 3న స్ట్రోక్తో ఆయన న్యూరాలజీ వార్డులోని HDU (హై డిపెండెన్సీ యూనిట్)లో చేరారు” అని ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
అయోధ్య రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారిగా సేవలందించారు.నిర్వాణి అఖాడా సభ్యుడైన ఆయన 20 సంవత్సరాల వయస్సులో ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు నుంచి సత్యేంద్ర దాస్ రామాలయ ప్రధాన పూజారిగా ఉన్నారు. .