*బర్డ్ ఫ్లూ సోకిన మరియు వ్యాధి తో చనిపోయిన కోళ్లను పూడ్చివేత చేపట్టిన అధికారులు*
తణుకు మండలం వేల్పూరులోని బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల పూడ్చివేత ప్రక్రియను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం స్వయంగా పరిశీలించారు.
పశు సంవర్థక, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి పీపీఈ కిట్ ధరించిన కలెక్టర్ నాగరాణి స్వయంగా కోళ్లఫారాల్లోకి వెళ్లి కోళ్ల పూడ్చివేత ప్రక్రియపై ఆరా తీశారు.
శాస్త్రీయ పద్ధతిలో అత్యంత జాగ్రత్తగా పూడ్చివేత చేపట్టాలని కోరారు.
ప్రజలు ఆందోళనకు గురి కావలసిన అవసరం లేదన్నారు….
ఆంధ్రప్రదేశ్లో 10 లక్షలకుపైగా కోళ్లు మృతి చెందాయి.
ఈనేపథ్యంలో ప్రభుత్వం, పశుసంవర్ధకశాఖ చికెన్ తినడం కొద్దిరోజులు మానేయాలని సూచించింది. అయినప్పటికి మనిషికి బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్లుగా తొలి కేసు నమోదైంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని ఓ కోళ్లఫారమ్ దగ్గర ఉంటున్న వ్యక్తిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ రావడంతో అతడికి చికిత్స అందిస్తున్నారు. సమీపంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు..
మనిషికి బర్డ్ ఫ్లూ వైరస్..
ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి ప్రాంతం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని ఓ కోళ్లఫారమ్ దగ్గర ఉంటున్న వ్యక్తిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ రావడంతో అతడికి చికిత్స అందిస్తున్నారు. సమీపంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.. అయితే తొలి కేసు బయటపడటంతో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. అతనితో పాటు కుటుంబ సభ్యులు, చుట్టు పక్కల వాళ్ల వివరాలు సేకరిస్తున్నారు. స్థానిక చికెన్ వ్యాపారుల వివరాలు సేకరిస్తున్నారు…