AICC తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్..!

AICC తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి
దీపాదాస్‌ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌
ఉత్తర్వులు జారీ చేసిన కేసీ వేణుగోపాల్‌
రాహుల్‌గాంధీ టీమ్‌లో కీలకంగా ఉన్న మీనాక్షి నటరాజన్..

తెలంగాణ నూతన ఏఐసీసీ ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ ను నియమిస్తూ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో దీపాదాస్ మున్షీ భాద్యతలు నిర్వర్తించారు. మీనాక్షి నటరాజన్ ను నియమిస్తూ పార్టీ అధిష్టానం ప్రకటించడంపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. మొత్తం 9 రాష్ట్రాలకు ఇంచార్జ్ లను మార్చగా అందులో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇంచార్జ్ ను మార్పు చేయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.