ఆ రోజు బ్యాంకులకు సెలవు రద్దు..ఆర్‌బీఐ నిర్ణయం.!.

RBI : సెలవుల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా ఓ ప్రకటన చేసింది. మార్చి 31న (రంజాన్ పండుగ సెలవు ) బ్యాంకు సెలవు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

2024-2025 ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు కావడంతో అన్ని లావాదేవీలు అదే రోజు నమోదు అయ్యేలా చూసేందుకు దానిని రద్దు చేసింది.

ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. దాంతో పాత సంవత్సరం ముగింపు రోజే ప్రభుత్వ ఆదాయం, చెల్లింపులు పూర్తవ్వాలి. అందుకే ఆ లావాదేవీలు నిర్వహించే బ్యాంకులు విధులు నిర్వర్తించేలా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆదాయపు పన్ను, జీఎస్టీ, కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీ వంటి ప్రభుత్వ పన్ను చెల్లింపులు, పెన్షన్ చెల్లింపులు, ప్రభుత్వ సబ్సిడీలు, జీతభత్యాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లావాదేవీలు చేసుకోవడానికి వీలుఉంటుంది.*_