కెరళలోని ఒక కాథలిక్ చర్చి భూమిలో పురాతన ఆలయ అవశేషాలు బయటపడ్డాయి. ఈ ప్రదేశంలో నుంచి శివలింగంతో సహా అనేక మతపరమైన చిహ్నాలు కనుగొన్నారు. దీంతో ఈ ప్రాంతం చర్చనీయాంశంగా మారింది..ఆసక్తికరమైన విషయం ఏంటంటే.Temple remains discovered at church site in Kerala.. ఈ అవశేషాలు బయటపడ్డ స్థలంలో పూజలు చేసుకునేందుకు చర్చి నిర్వాహకులు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని పలై డయోసెస్ ఛాన్సలర్ ఫాదర్ జోసెఫ్ కుట్టియాంకల్ కూడా అంగీకరించారు. దీన్ని స్నేహపూర్వక వైఖరిగా స్థానికులు చెబుతున్నారు.
ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. చర్చికి సంబంధించిన 1.8 ఎకరాల భూమిని కాసావా (టాపియోకా) సాగు కోసం దున్నుతున్నారు. ఈ ప్రదేశం శ్రీ వనదుర్గా భగవతి ఆలయం నుంచి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో ఉంది. అవశేషాలు బయటపడటంతో ఆలయ కమిటీ సభ్యులు కూడా షాక్ అయ్యారు. ఈ సందర్భంగా.. శ్రీ వనదుర్గా భగవతి ఆలయ కమిటీ సభ్యుడు వినోద్ కెఎస్ మాట్లాడారు. “వాస్తవానికి ఫిబ్రవరి 4న అవశేషాలు దొరికాయి. అయితే రెండు రోజుల తర్వాత అక్కడ దీపాలు వెలిగించాం. అప్పుడే స్థానికులకు ఆ స్థలం గురించి తెలిసింది. దీని తరువాత.. ఆలయ కమిటీ చర్చి నిర్వాహకులను సంప్రదించింది. హిందూ సమాజం యొక్క మనోభావాలను గౌరవిస్తూ పూజలు నిర్వహించుకునేందుకు నిర్వాహకులు అంగీకరించారు. ” అని తెలిపారు.
మీనాచిల్ (పలై) హిందూ మహాసంఘం అధ్యక్షుడు న్యాయవాది రాజేష్ పలాట్ ఈ స్థలానికి సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు. ఇక్కడ ఆలయం ఉన్నట్లు తమ పూర్వీకులు కథలు చెప్పినట్లు తెలిపారు. ఈ భూమి ఒకప్పుడు బ్రాహ్మణ కుటుంబానికి చెందినదని పూర్వీకులు చెప్పారన్నారు. కానీ దాదాపు ఒక శతాబ్దం క్రితం ఆలయం శిథిలావస్థకు చేరుకుందని, క్రమంగా భూమి హిందూ యజమానుల నుంచి క్రైస్తవ సమాజానికి బదిలీ అయిందన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Welcome to R9 Telugu News : Get Latest and Breaking News in Telugu, Top News Headlines from Hyderabad and Telangana at our flagship website r9telugunews.com Read Latest Telugu Daily News, Andhrapradesh, Telangana, India, World, Business, Sports, Entertainment News updtes...