రూ.5 కోట్ల బంగారం చోరీ….

*రూ.5 కోట్ల బంగారం చోరీ..*

*4 కేజీల 900 గ్రాముల బంగారంతో స్కూటీపై విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తున్న నాగరాజు*

*మార్గ మధ్యలో బంగారం మాయం*

*విజయవాడ జైహింద్ కాంప్లెక్స్ లోని డీవీఆర్ జ్యూవెలరీస్ లో 20 ఏళ్లుగా పనిచేస్తున్న నాగరాజు*

*స్కూటీపై వెళ్తుండగా.. టూవీలర్ పై వచ్చిన ఇద్దరు దొంగలు బంగారం ఎత్తుకెళ్లారని అంటున్న నాగరాజు*

*విచారణ నిమిత్తం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు నాగరాజు తరలింపు.

తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేసి ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న నాగరాజు భార్య..

ఘటన తర్వాత నాగరాజు బంధువులకు ఫోన్ చేసి సమాచారం అందించగా, వారు పోలీసుల సహాయంతో ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. అయితే, ఆ ప్రాంతంలోని దుకాణదారులు ఇలాంటి ఘటన జరిగిందని ఎవరూ చెప్పలేదని పోలీసులు తెలిపారు. సీసీ కెమేరాల ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు..
నాగరాజు మొబైల్ ఫోన్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 8:30 నుంచి 9:15 గంటల మధ్య అతను ఎవరితో మాట్లాడాడో వివరాలు సేకరిస్తున్నారు. నాగరాజు చోరీ 9:05 గంటలకు జరిగిందని చెప్పినప్పటికీ, పెద్దమొత్తంలో బంగారం దొంగతనం జరిగితే ఆ ప్రాంతంలోని వారికి తెలియకపోవడం పోలీసులను అనుమానానికి గురిచేస్తోంది. సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ వెంకట్‌లు ఘటనా ప్రదేశంలో విచారణ జరిపారు. చోరీ జరిగిందా లేదా నాగరాజు స్వయంగా ఇదంతా ప్లాన్ చేశాడా? అనే అంశంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు… విచారంలో పూర్తి విషయాలు బయటపడతాయని వెల్లడించిన పోలీసు అధికారులు…