బిజెపి నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరికలు…

నేరడిగొండ : కేంద్ర అధికార పార్టీని తలదన్ని నేరడిగొండ మండల బీజేపీ అధ్యక్షుడు సాబ్లే సంతోష్, ఆయన అనుచరులతో ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సాబ్లే సంతోష్ మాట్లాడుతూ కార్యకర్తలను గుర్తించడంలో బీజేపీ విఫలమైందని నమ్ముకున్న కార్యకర్తలకు తగిన ఫలితం కల్పించట్లేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పై ప్రజలు తిరగపడుతున్నారని ఇక తెలంగాణ రాష్ట్రాన్ని మంచి చేయాలనే ఉద్దేశం ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని బోథ్ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే అనిల్ జాధవ్ విజన్, క్రేజ్ చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరానని అన్నారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గుర్తిస్తుందని మీ అందరికీ కూడా తగిన స్థానం అందిస్తుందని కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజల పై చేస్తున్న అరాచకాలను స్థానిక సంస్థల్లో ప్రజలకు తెలియజేయాలని, స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.