🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌿పంచాంగం🌿
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 17 – 02 – 2025,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
మాఘ మాసం,
బహుళ పక్షం,
తిథి : *పంచమి* రా2.28 వరకు,
నక్షత్రం : *చిత్ర* తె5.35 వరకు,
యోగం : *శూలం* ఉ7.40 వరకు,
కరణం : *కౌలువ* మ1.25 వరకు,
తదుపరి *తైతుల* రా2.28 వరకు,
వర్జ్యం : *ఉ11.52 – 1.39*
దుర్ముహూర్తము : *మ12.36 – 1.22,*
మరల *మ2.53 – 3.39,*
అమృతకాలం : *రా10.29 – 12.15,*
రాహుకాలం : *ఉ7.30 – 9.00,*
యమగండం : *ఉ10.30 – 12.00,*
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 6.30,
సూర్యాస్తమయం: 5.57,
*_నేటి మాట_*
*భగవంతునితో మన బంధం ఎలాంటిది??*
‘భగవంతుడు మన పాత స్నేహితుడే, అది గుర్తుంచుకోవాలి!!… *అది ఎలా??*
మన ఇంటికి ఎవరైనా క్రొత్త స్నేహితుడువస్తే, ‘ రండి, దయచేసి కూర్చోండి” అని మర్యాద చేస్తారు.
కానీ పాత స్నేహితుడు వస్తే, ప్రేమతో ” రారా, కూర్చోరా” అని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాము…
ఎందుకంటే పాత స్నేహితునితో మనకు చనువు ఉంటుంది, ప్రేమ ఉంటుంది…
త్యాగరాజు కు రామునితో, అట్టి సంబంధము ఉండటం చేతనే, ” రార మా ఇంటి దాకా…. ” అని ఎంతో స్వేచ్ఛగా చనువుగా, ఆర్తితో పిలిచాడు.
మనము కూడా దైవాన్ని, మన పాత స్నేహితునిగా, భావించి దైవంతో స్వేఛ్చగా మెలగాలి…
ఎన్నో జన్మల నుండి భగవంతుడు మీ వెంటనే వస్తున్నాడని విశ్వశించాలి, అదే నిజమైన భక్తుని లక్షణం!!..
భగవంతుడంటే భయంగా ఉండకూడదు, పాప భీతి ఉండాలి కాని దైవభీతి ఉండకూడదు…
దైవ ప్రీతి ఉండాలి, అప్పుడే దైవం లభ్యమౌతాడు.
*_🌿శుభమస్తు🌿_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏