మహా నగరం ముంబై డేంజర్ లో పడే అవకాశం ఉందని నాసాశాస్త్రవేత్తలు వెల్లడించారు. ఓ పెద్ద ఆస్ట్రాయిడ్ దూసుకువస్తుందని అమెరికా అంతరిక్ష సంస్థ తెలిపింది..2024 YRA గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం ఉందని తేల్చింది. ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష సంస్థలు ఈ విషయంపై దృష్టిని కేంద్రీకరించాయి.
సిటి కిల్లర్గా పేర్కొన్న పేర్కొన్న ఓ భారీ శకలం భూమివైపు దూసుకొస్తుంది. నాసా శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం తూర్పు పసిఫిక్ మహా సముద్రం నుంచి దక్షిణాసియా వరకు ఈ గ్రహశకలం విస్తరించి ఉంది. ఈ అంతరిక్ష శిల2032 డిసెంబర్ 22న ఢీకొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం బొగోటా, కొలంబియా, లాగోస్, నైజీరియా, ముంబై వంటి మహానగరాలపై పడే అవకాశం ఉంది.
ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన నగరాలు ముంబై, ఢాకా, బొగోటా, అబిడ్జాన్, లాగోస్, ఖార్టూమ్ ప్రమాదంలో పడుతున్నాయి. నాసా శాస్త్రవేత్తల నివేదికల ప్రకారం. అంతర్జాతీయ ఆస్టరాయిడ్ హెచ్చరిక నెట్వర్క్కు అనుసంధానించిన భూ-ఆధారిత టెలిస్కోప్ల నుంచి పరిశీలనలు కొనసాగుతాయి. ఈ గ్రహశకలం జూన్ 2028 వరకు చాలా మసకగా మారుతుంది. ఈ గ్రహశకల ప్రమాద ప్రాంతం తూర్పు పసిఫిక్ మహాసముద్రం, ఉత్తర దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆఫ్రికా, అరేబియా సముద్రం, దక్షిణాసియా అంతటా విస్తరించి ఉంది.
2024 డిసెంబర్లో ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్న 2024 YR4 అనే గ్రహశకలాన్ని నాసా శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు.2024 YRA అనేగ్రహశకలం 130 అడుగుల నుంచి 300 అడుగుల వెడల్పు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సిటి కిల్లర్ భూమిని ఢీకొనే అవకాశం 3.1శాతంగా ఉందని తేల్చింది.
ఈ గ్రహశకలం అంటే ఒక పెద్ద కార్యాలయ భవనం పరిమాణంలో ఉంటుందని నాసా పేర్కొంది. అంతరిక్షం నుంచి… ఒక పెద్ద పర్వతం భూమిపై పడితే ఎంత విధ్వంసం ఉంటుందో అంతే స్థాయిలో ఉంటుంది. ఆ గ్రహశకలం మన భూమి వాతావరణంలో విడిపోయినా లేదా భూఉపరితలంపై ఒక బిలంను ఢీకొన్నా అది హైడ్రోజన్ బాంబును పోలి ఉంటాయి. ఇవి ఏదైనా మహానగరాన్ని నాశనం చేసేంతగా వినాశనాన్ని సృష్టించగలదు.
నాసా, చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA), రష్యన్ స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) వంటి ఇతర అంతరిక్ష సంస్థలతో సమన్వయంతో ఆ గ్రహశకలం మార్గాన్ని గుర్తిస్తోంది. అది కంటికి కనిపించనంతగా తగ్గిపోయే ముందు ఆ గ్రహశకలం పరిమాణం, గమనం అంచనాలను పరిశీలించేందుకు నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ను ఉపయోగిస్తుంది.