బంగారం చోరీ నిందితుల అరెస్టు…!

*సూర్యాపేట జిల్లా…*

హుజూర్ నగర్,,మఠంపల్లి లొ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులని అదుపులో తీసుకొని, వారి వద్ద నుండి సుమారు రెండు లక్షల, ముపై రూపాయల విలువ కలిగిన బంగారాన్ని స్వాధీన పరచుకొని, పోలీస్ లు.. మఠంపల్లి ఎస్సై బాబు సమక్షంలో, నిందితులని రిమాండ్ కి తరలించినట్లు తెలిపిన సీఐ చరమందరాజు…. పాల్గొన్న ….

*సీఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం* ..

20వ తారీకు జనవరి మఠంపల్లి మండలం సుల్తాన్పూర్ తండా దగ్గర పట్టపగలే ఇంట్లోకి ప్రవేశించి ఇంటి డోర్లు పగలగొట్టి ఆ ఇంట్లోకి వెళ్లి బంగారం దొంగిలించడం, తోపాటు హుజూర్ నగర్ లో దద్దనల చెరువులో కూడా ఒక ఇంట్లో బంగారం దొంగిలించినట్లు తెలిసింది.. రెండు నేరాలు సంబంధించి నాలుగు తులాల,, నాలుగు గ్రాముల 300 మిల్లీగ్రాముల బంగారం సంబంధించినటువంటి వస్తువులు కూడా రికవరీ చేసుకోవడం జరిగింది… ఇందులో ఒక పుస్తెలతాడు మరియు చెయ్యి కమలు రెండు రింగులు, ఒక లాకెట్ వీటిని రికవరీ చేసి చేయడం జరిగింది సుమారుగా వీటి విలువ.. రెండు లక్షల 30 వేల రూపాయలుగా తెలిపారు..

నిందితులు షేక్ నాగుల్ మీరా.. దద్దనాల చెరువు,,
పీసా గోపి… గోపాలపురం గ్రామానికి చెందిన వ్యక్తి…..

షేక్ అక్బర్… ఖమ్మం జిల్లా సిరిపురం వాసి.. వీరంతా. గత లో కూడా టౌను అనంతగిరి మరియు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా వీరిపై దొంగతనాలు కేసు ఉందని.. ఆ కేసులో జైలుకి కూడా వెళ్లి రావడం జరిగిందని అన్నారు.. నేడు వీరిని రిమాండ్కు పంపించడం జరిగిందని తెలిపారు..

ప్రజలందరూ కూడా వేసవికాలం పెళ్లిళ్ల సీజన్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.. అనుమానితులు ఎవరు కనిపించినా పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయాలని తెలిపా… ఎటైనా దూర ప్రాంతాలకు వెళ్ళినట్లయితే చుట్టుపక్కన ఇల్లవారికి.. సంబంధిత పోలీస్ స్టేషన్ కి తెలపాలని ప్రజలకు సూచించారు…