పాక్ జైలు నుంచి విడుదలై గుజరాత్ చేరుకున్న జాలర్లు
పాక్ జైలు నుంచి విడుదలై గుజరాత్ చేరుకున్న జాలర్లు
పాకిస్తాన్ కరాచీ జైలు నుండి విడుదలైన తర్వాత 22 మంది భారతీయ జాలర్లు గుజరాత్లోని గిర్ సోమనాథ్కు చేరుకున్నారు. గుజరాత్లోని అరేబియా సముద్ర సరిహద్దు సమీపంలో చేపలు పడుతున్న ఈ మత్స్యకారులను ఏప్రిల్ 2021, డిసెంబర్ 2022 మధ్య పాకిస్తాన్ సముద్ర భద్రతా దళం అరెస్ట్ చేసింది. దాదాపు 200 మంది భారత జాలర్లు ప్రస్తుతం పాకిస్తాన్ జైళ్లలో ఉన్నట్లు సమాచారం..
ఏపీకి, తెలంగాణకి ఉన్న తేడా అదే: పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తెలంగాణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాళ్లకి ‘నా తెలంగాణ’ అనే భావం ఉందని, ఆంధ్రప్రదేశ్ వాళ్లకి కులాలు అనే భావన తప్ప మేం ఆంధ్రులం అనే భావన లేదని అన్నారు. ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనే ఆంధ్రులం అనే ఫీలింగ్ వచ్చిందని అన్నారు. ఏపీలో NDA కూటమి పదిహేనేళ్ల పాటు కలిసి అధికారంలో ఉంటుందని, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తుందని పవన్ స్పష్టం చేశారు.
ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద పోలీసు వాహనం బోల్తా..
*సంగారెడ్డి జిల్లా:*
పటాన్చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద పోలీసు వాహనం బోల్తా..
పోలీస్ వాహనంలో ఉన్న నలుగురు సిబ్బందికి తీవ్ర గాయాలు..
టైరు బ్లాస్ట్ కావడంతో వాహనం బోల్తా..
పోలీసు వాహనం సైబరాబాద్ కమిషనరేట్ చెందింది..
సైబరాబాద్ కమిషనరేట్ నుండి సంగారెడ్డి జైలుకు వెళ్తుండగా ఘటన..
కుంభమేళా రేపటితో ముగింపు..
ప్రయాగబరాజ్ లో మహా కుంభమేళా రేపు మహా శివరాత్రి సందర్భంగా అధికారికంగా ముగుస్తుంది.
ఈ సందర్భంగా విస్తృతంగా ఏర్పాట్లు జరిగాయి. భక్తుల భద్రత కోసం పాలనా యంత్రాంగం పలు చర్యలు తీసుకుంది.
భక్తుల భద్రత, సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రయాగ్రాజ్ జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ మందాద్ తెలిపారు..
SLBC టన్నెల్ కార్మికుల బాధలు వర్ణనాతీతం!.. కూలి తక్కువ చాకిరి ఎక్కువ
గొడ్డు చాకిరి చేపించుకొని రూ.600 కూలీ మాత్రమే ఇస్తున్నారు అంటూ SLBC కార్మికుల ఆవేదన
రోజుకి 10 గంటలు గొడ్డు చాకిరి చేయించుకొని కేవలం రూ.600 కూలీ మాత్రమే ఇస్తున్నారు
ప్రమాదం ఉందని తెలిసినా మళ్ళీ మట్టి తొలగించడానికి రమ్మని పిలుస్తున్నారు, మేము లోపలికి వెళ్ళాక మళ్ళీ టన్నెల్ కూలీతే మా పరిస్థితి ఏంటి?
3 నెలలుగా కూలీ ఇవ్వట్లేదు, అడిగితే ఇష్టముంటే చేయండి లేకపోతే మానేయండి అంటున్నారు – SLBC కార్మికులు….
*12 మంది ఆప్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్*
12 మంది ఆప్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంగళవారం సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ 12 మంది ఆప్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. బీజేపీ నేతలు ఇటీవల సీఎం కార్యాలయం నుంచి బీఆర్ అంబేడ్కర్, భగత్ సింగ్ల ఫొటోలు తొలగించారు. దీనిపై ఆప్ నేతలు అసెంబ్లీలో ఆందోళన చేపట్టారు. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగిస్తుండగా నిరసన చేపట్టడంతో స్పీకర్ వారిని ఒక రోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు…
గుల్మార్గ్లో ఆహ్లాదం పంచుతున్న మంచు వర్షం …
జమ్ముకశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో వాతావరణం ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం భానుడి భగభగలతో మెరిసిన ప్రాంతం సాయంత్రానికి చల్లబడింది. ఒక్కసారిగా మంచు వర్షం మొదలై వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చింది. చాలా రోజులుగా డ్రైగా ఉన్న గుల్మార్గ్ వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు…