వక్ఫ్ బిల్లు సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం..

వక్ఫ్‌ బిల్లు పరిశీలనకు ఏర్పాటైన జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సూచించిన సవరణలకు కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది..

* దీంతో రెండో దఫా బడ్జెట్‌ సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి, చర్చించేందుకు మార్గం సుగమమైంది..

* జగదాంబిక పాల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన జేపీసీ కమిటీ కేంద్ర వక్ఫ్‌ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడం, వివాదాలకు సంబంధించిన విచారణలను జిల్లా కలెక్టర్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ ఉద్యోగికి అప్పగించడం, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డులో ముస్లిం ఓబీసీ వర్గం నుంచి ఓ వ్యక్తిని నియమించి, ఆయన అధికారాలను విస్తృతం చేయడం వంటి సవరణలను సూచించింది..