SLBC..టన్నెల్లో చిక్కుకున్న 8మంది మృతి చెందినట్లుగా అధికారులు వెల్లడించారు.గత వారం రోజులుగా వాళ్ల ఆచూకి కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినప్పటికి ప్రయోజనం లేకపోయింది…టన్నెల్లో చిక్కుకున్న 8మందిలో ఇద్దరు ఇంజనీర్లు, ఆరుగురు కూలీలు ఉన్నారు. టన్నెల్లోని అధునాతన పరికరాలు, రాడర్లతో మూడు మీటర్ల మట్టిలో చిక్కుకుని సజీవ సమాధి అయిన్నట్లుగా గుర్తించారు.
టన్నెల్లో సజీవ సమాధి..
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8మంది కార్మికులు మృతి చెందారు. ఈనెల 21న తేదీన టన్నెల్లో గల్లంతైన 8మంది కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టంది ప్రభుత్వం.ఇందులో రెస్క్యూ ఆపరేషన్ కోసం భారీ యంత్ర సామాగ్రితో పాటు రెస్క్యూ సిబ్బంది, రైల్వే నిపుణుల సహాయంతో టీబీఎం మిషన్, ప్లాస్మా గ్యాస్ కట్టర్ల సహాయంతో టన్నెల్ ను కట్ చేసి శిథిలాలను తొలగించి 8మంది మృతదేహాలను బయటకు తీశారు.చనిపోయిన 8మందిలో ఇద్దరు ఇంజనీర్లు, ఆరుగురు కూలీలు ఉన్నారు.
విషాదంగా ముగిసిన రెస్క్యూ ఆపరేషన్..
సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే రోజున 8మంది టన్నెల్లో చిక్కుకున్నారు. వారి జాడ తెలుసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక యంత్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈరోజు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడర్ను లోపలికి పంపింది. పైకప్పు కూలిపడిన చోట శిథిలాల కింద ఏముందని పరిశీలించారు. ఈక్రమంలోనే మూడు అడుగుల మట్టిలో 8మంది మృతదేహాలు కూరుకుపోయి ఉన్నట్లుగా పరికరం ద్వారా తెలుసుకున్నారు.
వారం తర్వాత శవాలు గుర్తింపు..
ఇక టన్నెల్లో సజీవ సమాధి అయిన 8మంది మృతదేహాలను బయటకు తీస్తున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. దీనిపై ఇప్పటి వరకు అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసుకున్నాయి. అయితే లోపల చిక్కుకున్న కార్మికులు ప్రాణాలతో ఉంటారని భావిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ సరిగా చేపట్టడం లేదని ..బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈనేపథ్యంలోనే లోపల చిక్కుకున్న 8మంది చనిపోయినట్లుగా తేలిపోయింది…