న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం…

చాపియన్స్‌ ట్రోఫీలో 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన చివరి గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లో టీమిండియా సూపర్‌ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ ఓడిపోయినా…30 పరుగులకే టాపార్డర్‌ కుప్పకూలిన భారత జట్టు కోలుకొని నిలబడిన తీరు అద్భుతమనే చెప్పాలి. శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌ 4వ వికెట్‌కు జోడించిన 98 పరుగుల పార్ట్నర్‌షిప్‌తో పాటు, చివర్లో పాండ్యా ఆడిన 45 పరుగుల ఇన్నింగ్స్‌ టీమిండియాకు మంచి స్కోర్‌ ఇచ్చింది. ఇక ఈ విజయంతో టీమిండియా మంగళవారం(మార్చ్‌ 4న) తొలి సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఢీ కొట్ట నుంది. ఆస్ట్రేలియాను సెమీస్‌లోనే ఓడించేస్తే ఇక ఫైనల్‌లో టీమిండియా కూల్‌గా ఆడి కప్పు కొట్టడం ఖాయమని క్రికెట్‌ అభిమానులు కూడా భావిస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు కివీస్‌ బౌలర్లు ఆరంభంలోనే గట్టి షాకిచ్చారు. పవర్‌ ప్లే ముగిసే లోపే.. టీమిండియా టాప్‌ 3 బ్యాటర్లను పెవిలియన్‌ చేర్చారు. తొలుత శుబ్‌మన్‌ గిల్‌(2), మ్యాట్‌ హెన్రీ బౌలింగ్‌లో లెగ్‌ బిఫోర్‌గా అవుట్‌ అయ్యాడు. ఆ వెంటనే రోహిత్‌ శర్మ(15) జెమిసన్‌ బౌలింగ్‌లో విల్‌ యంగ్‌కు క్యాచ్‌ ఇచ్చిన పెవిలియన్‌ చేరాడు. ఇక విరాట్‌ కోహ్లీ రెండు ఫోర్లు కొట్టి.. గత మ్యాచ్‌లో ఎక్కడైతే ఆపేశాడో అక్కడి నుంచి మొదలుపెడుతున్నట్లు కనిపించాడు.

కానీ, సూపర్‌ మ్యాన్‌ ఫీల్డర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ అద్భుతమైన క్యాచ్‌తో కోహ్లీ అవుట్‌ అయ్యాడు. పాయింట్‌లో సూపర్‌గా గాల్లోకి డైవ్‌ చేస్తూ ఫిలిప్స్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. అక్షర్‌ పటేల్‌ 61 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 42 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేటికే అయ్యర్‌ అవుట్‌ అయ్యాడు. 98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 79 పరుగులతో సెంచరీ దిశగా సాగుతున్నట్లు కనిపించినా.. విలియన్‌ రూర్కీ బౌలింగ్‌లో తన షార్ట్‌ పిచ్‌ బాల్‌ వీక్‌నెస్‌కు మరోసారి బలయ్యాడు. ఇక రాహుల్‌ 23, జడేజా 16 రన్స్‌ చేసి నిరాశపర్చారు. హార్ధిక్‌ పాండ్యా 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 45 పరుగులు చేయడంతో టీమిండియాకు మంచి ఫైటింగ్‌ స్కోర్‌ వచ్చింది. షమీ 5 పరుగుల చేసి 9వ వికెట్‌గా అయ్యాడు. కుల్దీప్‌ ఒక్క పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు.

కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 5 వికెట్లతో సత్తా చాటాడు. జెమిసన్‌, విలియమ్‌ రూర్కీ, సాంట్నర్‌, రచిన్‌ రవీంద్ర తలో వికెట్‌ తీసుకున్నారు. ఇక 250 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు హార్ధిక్‌ పాండ్యా ఆరంభంలోనే ఎదురుదెబ్బ కొట్టాడు. ఓపెనర్‌ రచిన్‌ రవీంద్రను అవుట్‌ చేశాడు. ఆ తర్వాత విల్‌ యంగ్‌ను వరుణ్‌ చక్రవర్తి అవుట్‌ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కేన్‌ విలియమ్సన్‌ మాత్రం క్రీజ్‌లో పాతుకుపోయాడు. దాదాపు అతనొక్కడే 20 ఓవర్లు బ్యాటింగ్‌ చేశాడు. 120 బంతుల్లో 7 ఫోర్లతో 81 పరుగులు చేసి 7వ వికెట్‌గా వెనుదిరిగాడు. విలియమ్స్‌ తప్పితే మిగతా బ్యాటర్లు పెద్దగా ఇంప్యాక్ట్‌ చూపించలేదు. డారిల్‌ మిచెల్‌ 17, టామ్‌ లాథమ్‌ 14, గ్లెన్‌ ఫిలిప్స్‌ 12, మిచెల్‌ బ్రేస్‌వెల్‌ 2 పరుగులు చేసి విఫలం అయ్యారు.

చివర్లో కివీస్‌ కెప్టెన్‌ సాంట్నర్‌ కొద్ది సేపు మెరుపులు మెరిపించినా.. అప్పటికే రిక్వైర్డ్‌ రన్‌రేట్‌ భారీగా పెరిగిపోయింది. 31 బంతుల్లో ఒక ఫోర్‌, 2 సిక్సులతో 28 పరుగులు చేసిన సాంట్నర్‌ను వరుణ్‌ చక్రవర్తి క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. మొత్తంగా న్యూజిలాండ్‌ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్‌ అయిపోయింది. భాతర బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి ఏకంగా 5 వికెట్ల హాల్‌ సాధించాడు. ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‌లు ఆడని వరుణ్‌, అవకాశం వచ్చిన మ్యాచ్‌లో తన సత్తా ఏంటో చూపించాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే సెమీస్‌లో కూడా వరుణ్‌ టీమ్‌లో ఉంటే ఛాన్స్‌ కనిపిస్తోంది. ఇక జడేజా 2, హార్ధిక్‌ పాండ్యా, అక్షర్ పటేల్‌, కుల్డీప్‌ యాదవ్‌ తలో వికెట్‌ తీసుకున్నారు…

ఎడమవైపుకు పక్షిలా దూకి కేన్ విలియమ్సన్ క్యాచ్, బిత్తరపోయిన రవీంద్ర జడేజా.

దుమ్మురేపాడు.భారత ఇన్నింగ్స్ 46వ ఓవర్‌లో ఆఫ్ సైడ్ జడ్డూ కొట్టిన బంతిని ఎడమ వైపునకు దూకుతూ మరీ లెఫ్టాండ్‌తో క్యాచ్ అందుకున్నాడు ఇది చూసిన జడేజా సహా ఫ్యాన్స్ షాక్ అయ్యారు..ఈ క్యాచే కాదు.. టీమిండియా ఇన్నింగ్స్‌లో కివీస్ ఆటగాళ్లు ఇంకొన్ని సూపర్బ్ క్యాచ్‌లు అందుకున్నారు. విరాట్ కోహ్లీ కొట్టిన బంతిని అద్భుతంగా ఒడిసిపట్టాడు గ్లెన్ ఫిలిప్స్. గాల్లో పక్షిలా ఎగురుతూ నమ్మశక్యం కాని రీతిలో డైవ్ చేసి పట్టేశాడు..

అక్షర్ పటేల్ స్టన్నింగ్ క్యాచ్..

లక్ష్యచేధనలో న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కలేదు. ఆరంభంలోనే రచిన్ రవీంద్ర(6)ను అక్షర్ పటేల్ స్టన్నింగ్ క్యాచ్‌తో హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన కేన్ మామతో కలిసి విల్ యంగ్ ఆచితూచి ఆడాడు. దాంతో పవర్ ప్లేలో కివీస్ వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే రోహిత్ శర్మ స్పిన్నర్లను బరిలోకి దించి న్యూజిలాండ్‌ను దెబ్బతీసాడు. విల్ యంగ్‌(22)ను వరుణ్ చక్రవర్తీ క్లీన్ బౌల్డ్ చేయగా.. ఆ మరుసటి బంతికే డారిల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్‌ను కేఎల్ రాహుల్ వదిలేసాడు. దాంతో కేన్ విలియమ్సన్‌తో కలిసి అతను మూడో వికెట్‌కు 44 పరుగులు జోడించాడు.

తిప్పేసిన వరుణ్ చక్రవర్తీ

డారిల్ మిచెల్‌(17)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. టామ్ లాథమ్‌(14)ను జడేజా పెవిలియన్ చేర్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు కేన్ విలియమ్సన్ పరుగులు రాబట్టాడు. 77 బంతుల్లో అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. గ్లేన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్‌లను వరుస ఓవర్లలో ఎల్బీగా వరుణ్ చక్రవర్తీ ఔట్ చేశాడు. మైకేల్ బ్రేస్‌వెల్ రివ్యూ తీసుకోకుండా మూల్యం చెల్లించుకున్నాడు. రిప్లేలో బంతి వికెట్లను మిస్సైనట్లు తేలింది.

సెంచరీ దిశగా సాగిన కేన్ మామను అక్షర్ పటేల్‌ కీపర్ క్యాచ్‌గా ఔట్ చేసి భారత విజయాన్ని ఖాయం చేశాడు. మిచెల్ సాంట్నర్ పోరాడినా.. అతన్ని క్లీన్ బౌల్డ్ చేసిన వరుణ్ చక్రవర్తీ.. అదే ఓవర్‌లో మ్యాట్ హెన్రీ క్యాచ్ ఔట్ చేసి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. వన్డేల్లో వరుణ్ చక్రవర్తీకి ఇదే తొలి ఐదు వికెట్ల ఘనత. ఆఖరి వికెట్‌గా విల్ ఓరూర్కీని కుల్దీప్ యాదవ్ ఔట్ చేసి భారత విజయలాంఛన్నా పూర్తి చేశాడు..