వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
కొత్త ఆదాయపు పన్ను చట్టం..అమలు తేదీ ఖరారు..
భారత ప్రభుత్వం కొత్త ఇంకమ్ ట్యాక్స్ చట్టం 2025ను (New Tax Regime India 2025) అధికారికంగా ప్రకటించింది. ఇది ఇప్పటికే దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా ఉన్న 1961 నాటి ఇంకమ్ ట్యాక్స్ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి, కొత్తగా తీసుకొచ్చిన చట్టం. ఈ కొత్త చట్టానికి ఆగస్టు 21న రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ కొత్త చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానుందని ప్రకటించారు..
ఆదాయపు పన్ను చట్టం-2025 వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే, 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇది పన్ను చట్టాలను మరింత సులభతరం చేయనుంది. ‘ఆదాయపు పన్ను చట్టం-2025 రాష్ట్రపతి ఆమోదం పొందింది. సరళమైన, పారదర్శకమైన, అనుకూలమైన ప్రత్యక్ష పన్ను విధానాన్ని ఇది తీసుకురానుంది’ అని ఆదాయపు పన్ను విభాగం ‘ఎక్స్’ వేదికగా తెలిపింది.
ఆదాయపు పన్ను-2025 బిల్లును ఈ నెల 12న పార్లమెంటు ఆమోదించింది. సంక్లిష్టమైన పన్ను చట్టాలను సులభంగా అర్థం చేసుకునేందుకు సరళమైన భాషలో దీన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అనవసర నిబంధనలనూ తొలగించింది. 1961 నాటి చట్టంలోని 819 సెక్షన్ల సంఖ్యను 536కు, 47 అధ్యాయాలను 23కు తగ్గించింది. పదాల సంఖ్యా 5.12 లక్షల నుంచి 2.6 లక్షలకు తగ్గింది. స్పష్టత పెంచేందుకు కొత్తగా 39 పట్టికలు, 40 సూత్రాలూ ఇందులో ఉన్నాయి.
ఏం కొత్తగా ఉంది?
ఈ కొత్త చట్టంలో కొత్త పన్ను రేట్లు ఏమీ లేవు, కానీ భాషని సరళంగా మార్చారు. పాత చట్టంలో 819 సెక్షన్లు, 47 చాప్టర్లు, 5.12 లక్షల పదాలు ఉండేవి. కొత్త చట్టంలో ఇవి 536 సెక్షన్లు, 23 చాప్టర్లు, 2.6 లక్షల పదాలకు తగ్గించారు. అంటే చట్టం చిన్నగా, ఈజీగా మార్చు చేశారు.
ఈ మార్పులు చిన్నవి కావని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇది పన్ను విధానాన్ని సులభతరం చేసే కొత్త విధానం. చట్టం సులభంగా చదవడానికి, అర్థం చేసుకోవడానికి, అమలు చేయడానికి రూపొందించ బడిందని తెలిపారు..
గమనిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959