🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 19 – 03 – 2025,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
బహుళ పక్షం,
తిథి : *పంచమి* రా8.58 వరకు,
నక్షత్రం : *విశాఖ* సా5.43 వరకు
యోగం : *హర్షణం* మ2.58 వరకు
కరణం : *కౌలువ* ఉ8.00 వరకు,
తదుపరి *తైతుల* రా8.58 వరకు,
వర్జ్యం : *రా10.05 – 11.50,*
దుర్ముహూర్తము : *ఉ11.44 – 12.31,*
అమృతకాలం : *ఉ8.01 – 9.46,*
రాహుకాలం : *మ12.00 – 1.30,*
యమగండం : *ఉ7.30 – 9.00,*
సూర్యరాశి : మీనం,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 6.10,
సూర్యాస్తమయం: 6.06,
*_నేటి మాట_*
*భక్తునికి భగవంతునిపై ఎలాంటి – విశ్వాసం వుండాలి??*
ఈరోజుల్లో కోరిక తీరితే దేవుడు, తీరకపోతే ఇంకా చెప్పనక్కర లేనేలేదు…
మరి మనకు ఎలాంటి విశ్వాసం వుండాలి???…
ఒక వ్యక్తి తన కొడుకుతో ఇంటికి తిరిగి వస్తున్నాడు…
వారు సముద్రంలో ఒక పడవలో ఉన్నారు,
అకస్మాత్తుగా పెద్ద తుఫాను వచ్చింది, తండ్రి యోధుడు, ప్రశాంతంగా ఉన్నాడు కానీ, కొడుకు చాలా భయపడ్డాడు, దాదాపు నిస్సహాయస్థితిలో జనా ఉన్నాడు.
వారిద్దరూ వెళ్తున్న పడవ చాలా చిన్నది, తుఫాను తీవ్రంగా ఉంది, ఏ క్షణంలోనైనా పడవ మునిగిపోయే అవకాశం ఉంది!!…
కొడుకు ఎంత భయపడుతున్నాడో, తండ్రి అంత మౌనంగా – ఏమీ జరగనట్లుగా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కూర్చున్నాడు.
కొడుకు వణికిపోతూ తండ్రితో ఇలా అన్నాడు… ”భయంగాలేదా.. ఇదే మన జీవితంలో చివరి క్షణం కావచ్చు , మనం ఒడ్డుకు చేరుకునేలా కనిపించడం లేదు..
ఈ క్షణంలో ఏదైనా అద్భుతం మాత్రమే మనల్ని రక్షించగలదు, లేదంటే మనం చనిపోతాం!”
కెరటాలు బలంగా పడవపై కొట్టడంతో ఒక్కసారిగా, “నీకు భయం వేయట్లేదా?” అని అరిచాడు.
కొడుకు అరుపులు విన్న తండ్రి నవ్వుతూ తన కోశం లోంచి కత్తిని తీశాడు, ఇప్పుడు కొడుకు మరింత కంగారు పడ్డాడు, తండ్రి ఏమి చేస్తున్నాడు? అని అనుకున్నాడు!!.
తండ్రి ఆ కత్తిని కుమారుడి మెడకు అతి దగ్గరగా తీసుకొచ్చాడు.
చాలా దగ్గరగా, కత్తి – మెడ మధ్య కేవలం సన్నని వెంట్రుక అంతరం మాత్రం మిగిలిఉంది, కత్తి దాదాపు అతని మెడకు తాకింది.
“ఇప్పుడు భయం కలగడం లేదా??“ అని అడిగాడు, తండ్రి…
కొడుకు నవ్వడం మొదలుపెట్టి, “నేనెందుకు భయపడాలి, నువ్వు నా తండ్రివి, కత్తి నీ చేతిలో ఉంది, నువ్వు నన్ను ఎప్పటికీ బాధించవని నాకు తెలుసు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనీ నాకు తెలుసు” అన్నాడు, తండ్రి కత్తిని వెనక్కి పెట్టి,
“ఇదే నా సమాధానం కుమారా!
భగవంతుడు నన్ను ప్రేమిస్తున్నాడని, తుఫాను ఆయన చేతిలో ఉందని నాకు తెలుసు.
కాబట్టి, ఏది జరగబోయినా అది మంచికే.
మనకు మనుగడ ఉన్నామంచిదే; లేకున్నామంచిదే, ప్రతిదీ ఆయన చేతుల్లోనే ఉంది, ఆయన తప్పు చేయడు అన్నాడు.
భగవంతుని పై నమ్మకాన్ని వృద్ధి చేసుకోవాలి, అది మన సమస్త జీవితాన్ని మార్చగలదు.
పూర్తిగా విశ్వసించాలి, ఎందుకంటే సందిగ్ధత పనిచేయదు కదా!!!
*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా: సుఖినోభవంతు🙏