కెసిఆర్ ను కలిసిన నల్గొండ జిల్లా ఎమ్మెల్యే,, మాజీ ఎమ్మెల్యేలు..

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి KCR ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతమహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్ శుక్రవారం ఎర్రవెల్లిలోని వారి నివాసంలో కలిశారు.

ఈ సందర్భంగా పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ, వరంగల్ బహిరంగ సభ తదితర అంశాలపై పార్టీ అధినేత నాలుగు నియోజకవర్గాల నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
త్వరలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిగతా ఎనిమిది నియోజకవర్గాల ముఖ్యనాయకులతో సమావేశం ఉంటుందని పార్టీ అధినేత కేసీఆర్ తెలిపారు.