లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్..

తల్లితో ఎఫైర్ పెట్టుకుని కూతురికి కడుపు చేసిన బాబాయ్

తల్లిని వలలో వేసుకుని.. మైనర్ బాలికకు కడుపు చేసిన దుర్మార్గుడు.

వరుసకు మరిదయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించి.. సొంత కూతురిని ఆ దుర్మార్గుడి కామాగ్నికి బలి చేసిన తల్లి

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అమ్మ ఆస్పత్రిలో శనివారం అబార్షన్ కేసు విచారణలో దారుణాలు వెలుగు చూశాయి

నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు విభేదాలతో కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు.. భార్య తన కూతురితో కలిసి భువనగిరి జిల్లా ఘట్కేసర్ ప్రాంతంలో నివాసముంటోంది

ఈ క్రమంలోనే ఆమెకు మరిది వరుసయ్యే రాము అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.. తల్లిని వలలో వేసుకున్న దుర్మార్గుడు ఈడుకొచ్చిన కూతురి కన్నేశాడు.

తల్లి ప్రొద్బలంతో దుర్మార్గుడు పలుమార్లు అత్యాచారం చేయడంతో గర్భం దాల్చిన బాలిక

ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక సదరు బాలిక కొద్దిరోజుల క్రితం అమ్మమ్మకు తెలిపింది. ఈ విషయం గుట్టు చప్పుడు కాకుండా తొర్రూరులోని అమ్మ ప్రైవేటు ఆస్పత్రిలో బాలికకు అబార్షన్ నిర్వహించారు.

బాలికకు అబార్షన్ జరిగిన విషయం చైల్డ్ లైన్కు ఫిర్యాదులు అందడంతో అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో తల్లి, ఆమె ప్రియుడి దారుణాలు వెలుగులోకి వచ్చాయి

అబార్షన్ నిర్వహించిన ఆస్పత్రి యాజమాన్యంపై, బాలికపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టిన రాము, అందుకు సహకరించిన బాలిక తల్లిపై అత్యాచారం, పోక్సో కేసులను నమోదు చేసిన పోలీసులు..

Live Update News.

♦️బీజేపీ అధ్యక్ష పదవిపై బండి సంజయ్ హాట్ కామెంట్స్.. నేను బీజేపీ అధ్యక్ష రేసులో లేను.. ఇస్తే వద్దనను.. అధ్యక్షుడిగా ఇప్పటికే నేనేంటో నిరూపించుకున్నాను.. కొంత మంది వ్యక్తులు అధ్యక్షులం అవుతున్నామని ప్రచారం చేసుకుంటున్నారు.. ఇలా ప్రచారం చేసుకోవడం పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకం.. కార్యకర్తలను కన్య్ఫూజ్ చేయవద్దు.. పార్టీ పెద్దలు అధ్యక్షుడ్ని నిర్ణయిస్తారు.. నేను కేంద్ర సహాయమంత్రిగా ఉన్నాను: బండి సంజయ్

♦️డీలిమిటేషన్తో ఎన్నో నష్టాలు ఉన్నాయి.. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.. కేంద్రం వివక్షతో ఇప్పటికే దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుంది.. దేశ సమాఖ్య స్ఫూర్తిని కాపాడాల్సిన అవసరం ఉంది.. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ సమ్మతం కాదు.. కేంద్రం బిగ్ బ్రదర్లా ఉండాలి కానీ.. బిగ్ బాస్లా కాదు: కేటీఆర్

♦️హైదరాబాద్: గచ్చిబౌలి ఫ్లై ఓవర్పై రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు టైర్ కింద పడి టెన్త్ విద్యార్థిని మృతి.. టెన్త్ పరీక్ష రాయించి చెల్లిని బైక్పై తీసుకెళ్తున్న అన్న.. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వెళ్తుండగా ఘటన.. ప్రమాదంలో అన్నకు గాయలు, ఆస్పత్రకి తరలింపు..

♦️మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చిట్‌చాట్.. త్వరలో ఉస్మానియా ఆస్పత్రి టెండర్లు పిలుస్తాం.. బీఆర్ఎస్‌ వాళ్లు మాటలతో బతకడం అలవాటైంది.. కేటీఆర్‌ తండ్రి చాటు కొడుకు.. హరీష్‌రావు మామ చాటు అల్లుడు.. వాళ్లు కనీసం డిప్యూటీ లీడర్లు కూడా కాదు, వాళ్లతో మేం ఏం మాట్లాడతాం?-కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

♦️గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణమురళి.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌ను దూషించిన కేసులో గల నెల 26న పోసాని అరెస్ట్

♦️హైదరాబాద్‌: పాతబస్తీలో టాస్క్‌ఫోర్స్‌ దాడులు.. టన్నుల కొద్దీ కుళ్లిన మటన్‌ సీజ్.. ఏకకాలంలో సౌత్ వెస్ట్, సౌత్‌ ఈస్ట్‌ టాస్క్‌ఫోర్స్‌ దాడులు.. 4 నెలలుగా ఫ్రిజ్‌ల్లో కుళ్లిన మాంసం నిల్వలు.. దుర్వాసన రాకుండా వెనిగర్‌ కలుపుతున్న ముఠా.. ఉత్తరాది రాష్ట్రాల నుంచి కుళ్లిన మాంసం రవాణా.. మంగళ్‌హాట్‌లో 12 క్వింటాళ్ల మాంసం, డబీర్‌పురాలో 2 క్వింటాళ్ల కుళ్లిన మాంసం స్వాధీనం..

ప్రకాశం :

ఏసీబీ వలకి చిక్కిన చీమకుర్తి ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్..

ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జీతం బిల్లు పెట్టేందుకు లంచం డిమాండ్ చేసిన ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్.

17,500 లంచం తీసుకుంటుండగా ప్రవీణ్ కుమార్ ని పట్టుకున్న ఏసిబి అధికారులు..

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి vs ఒరిజినల్ కాంగ్రెస్

అధికారంలో ఉన్నా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో ఇందిరా వర్గీయుల మీడియా సమావేశం

అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ కార్యకర్తల బ్రతుకులు బాగుపడతాయనుకున్నాం

వేరే పార్టీలో గెలిచి మా పార్టీలోకి వచ్చిన కడియం మాపై పెత్తనం చేస్తే ఎలా..?

మేము జెండాలు మోసి జనాలను ముఖ్యమంత్రి సభకు తరలిస్తే.. కడియం వర్గీయులకు స్టేజి పాసులతో సహా విఐపీ, వివిఐపీ పాసులు

ఇందిరా లేకపోతే స్టేషన్ ఘనపూర్లో కాంగ్రెస్ లేదు

మేం పదవులు కాంట్రాక్టర్లు అడగడం లేదు.. పార్టీలో మమ్మల్ని గుర్తిస్తే చాలు

ఎమ్మెల్యే కడియం పద్ధతి మార్చుకోకపోతే గాంధీభవన్ కు వెళ్తాం..

అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఆందోళన చేస్తాం..