న్యూస్ లైన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు శంకర్ అరెస్ట్.. రూంలోకి వెళ్లి మరీ…!

జర్నలిస్టు, న్యూస్ లైన్ తెలుగు ( News Line Telugu ) యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు శంకర్ కు ( Shankar) ఊహించని షాక్ తగిలింది. తాజాగా జర్నలిస్టు శంకర్ ను ( Journalist Shankar) పోలీసులు అరెస్టు చేశారు..హైదరాబాద్ లో ( Hyderabad ) ఉన్న తన నివాసంలో… జర్నలిస్టు శంకర్ ను అదుపులోకి పోలీసులు. ఓ మహిళ యూట్యూబర్ శంకర్ పై… అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో… అతన్ని అరెస్టు చేశారు..

ఏం జరిగిందంటే..
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, శంకర్‌పై ఆరోపణలు రాగానే చట్ట అమలు అధికారులు వేగంగా స్పందించి, ఆయనను ఆయన ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు. వేకువజామునే ఇంటికి వెళ్లి.. బెడ్‌రూం(Bed room)లో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ పోలీసులు ఈ అరెస్టును ధ్రువీకరించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను అనుసరిస్తున్నామని, దర్యాప్తు పూర్తయ్యే సమయానికి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు..