*2027లో ‘ప్రయాగ్ రాజ్ ‘కు పోటీగా నాసిక్ కుంభమేళా*
నాసిక్ :
మహారాష్ట్రలోని నాసిక్ 2027 జూలై 14 -సెప్టెంబర్ 25 మధ్య గోదావరి నది ఒడ్డున కుంభమేళా జరగనుంది. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరగబోతోంది. ప్రయాగ్ రాజ్ లో అత్యంత వైభవంగా జరిగిన మహాకుంభమేళాకు దీటుగా దీనిని చేయనున్నారు. దీనికి ‘త్రయంబకేశ్వర్-నాసిక్ సింహస్థ కుంభమేళా’గా నామకరణం చేయనున్నారని తెలుస్తోంది. ఇటీవల మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ కుంభమేళా ఏర్పాట్లను సమీక్షించేందుకు త్రయంబకేశ్వరున్ని సందర్శించారు.
*కేంద్రం ప్రభుత్వం నూతన ఆర్థిక సంవత్సరంలో మెడిసిన్ ధరలు అమాంతం పెంపు*
కేంద్రం ప్రభుత్వం నూతన ఆర్థిక సంవత్సరంలో మెడిసిన్ ధరలు అమాంతం పెంచేసింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ ఔషధ ధరల అథారిటీ 900 పైగా రకాల మెడిసిన్ ధరలను సవరించింది.
పెరిగిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయని జాతీయ ఔషధ ధరల అథారిటీ (NPPA) స్పష్టం చేసింది. గుండె సంబంధిత, డయాబెటిస్, క్రిటికల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన మెడిసిన్లపై సైతం గరిష్టంగా 1.74 శాతం వరకు ధరలు పెరిగాయి. గత ఏడాదిలో పోలిస్తే ఈ సంవత్సరం WPI 0.00551 శాతం అధికంగా ఉంది.
చట్ట ప్రకారం ప్రతి ఏడాది మెడిసిన ధరల సవరణ
ప్రతి సంవత్సరం టోకు ధరల సూచిక (WPI) ఆధారంగా NPPA అవసరమైన ఔషధాల ధరలను సవరిస్తుంటుంది. ‘ ఔషధాల (ధరల నియంత్రణ) చట్టం 2013 (DPCO, 2013) నిబంధనల ప్రకారం.. షెడ్యూల్ చేసిన ఔషధాల ధరలు హోల్‌సేల్ ధరల సూచిక (WPI) ఆధారంగా ఏటా సవరిస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఔషధాల ధరలు 0.00551 శాతం పెరిగాయి. ఇది వార్షిక మార్పు ఆధారంగా ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఔషధాల ధరల నియంత్రణ చట్టం DPCO, 2013 యొక్క పేరా 2(1)(u)లో పేర్కొన్న విధంగా NPPA కొత్త ఔషధాల రిటైల్ ధరను కూడా నిర్ణయిస్తుందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ వెల్లడించారు.
ఔషధ ధరల నియంత్రణ సంస్థ.. 2023లో ఇదే సమయంలో 2024 సంవత్సరంతో పోల్చితే WPIలో వార్షిక మార్పు (+) 1.74028 శాతం వరకు పెరిగిందని ఓ ప్రకటనలో తెలిపింది. నొప్పి నివారణ మెడిసిన్ డైక్లోఫెనాక్ టాబ్లెట్ రూ.2.09 సీలింగ్ ధరను కలిగి ఉంది. ఇబుప్రోఫెన్ టాబ్లెట్లు దాని 200 mg రూ.0.72, 400 mg డోసేజ్ రూ.1.22 ధర అయింది. యాంటీబయాటిక్ కోసం వాడే అజిత్రోమైసిన్ 250 ఎంజీకి 11.87 రూపాయలు, 500 ఎంజీ గ్రాముల డోసెజ్ ట్యాబ్లెట్ కు రూ.23.98 అయింది.
ఏది ఎంత కాస్ట్లీ అవుతోంది.. కొన్ని ముఖ్యమైన మెడిసిన్
– అమోక్సిసిలిన్, క్లావులానిక్ యాసిడ్ కలిగిన డ్రై సిరప్ ధర ఒక్క ఎంఎల్‌కు రూ2.09 గా నిర్ణయించారు.
– డైక్లోఫెనాక్ (పెయిన్ కిల్లర్) టాబ్లెట్‌కు గరిష్ట ధర రూ.2.09 అయింది.
– ఇబుప్రోఫెన్ (పెయిన్ కిల్లర్): 200 mg: టాబ్లెట్‌కు రూ.0.72, 400 mg టాబ్లెట్‌కు రూ.1.22.
– డయాబెటిస్ మందులు (డపాగ్లిఫ్లోజిన్ + మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ + గ్లిమెపిరైడ్) టాబ్లెట్‌కు రూ.12.74.
– ఎసిక్లోవిర్ (యాంటీవైరల్) టాబ్లెట్ 200 mg: టాబ్లెట్ ధర రూ.7.74, 400 mg: టాబ్లెట్‌కు రూ.13.90.
– హైడ్రాక్సీక్లోరోక్విన్ (యాంటీమలేరియల్): 200 mg టాబ్లెట్‌కు రూ.6.47, 400 mg టాబ్లెట్‌కు రూ.14.04.
జ్వరం, చెవి, కంటి, ముక్కు, అనస్తీషియా, గుండె, డయాబెటిస్, విటమిన్ టాబ్లెట్ల ధరలు పెరిగాయి. బేర్ మెటల్ స్టెంట్లపై గరిష్ట ధరను రూ. 10,692.69కి సవరించగా.. బయోరిసోర్బబుల్ వాస్కులర్ స్కాఫోల్డ్ (BVS)/ బయోడిగ్రేడబుల్ స్టెంట్, డ్రగ్-ఎలుటింగ్ స్టెంట్ ధర రూ. 38,933.14గా ఫిక్స్ చేశారు.
WPI ఆధారంగా ఔషధ తయారీదారులు ప్రతి ఏడాది గరిష్ట రిటైల్ ధరలను పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం వీరు కేంద్రం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని NPPA టోకు ధరల సూచిక (WPI) ఆధారంగా ప్రతి సంవత్సరం అవసరమైన మెడిసిన్ ఉత్పత్తుల ధరలను సవరిస్తుంది. ఈసారి 900 కు పైగా మెడిసిన్ ధరల్ని సవరించారు..
*జెమిలీ ఎన్నికలకు కేంద్రం సిద్ధం …*
న్యూడిల్లీ :
2027 నవంబర్ లేదా 2028 ఫిబ్రవరి లో జెమిలీ ఎన్నికలు రావడం అనేది మాత్రం ఖాయం న్యాయ నిపుణులతో చర్చించి నట్లు సమాచారం….
నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్‌బిల్లు!
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన మంగళవారం బీఏసీ సమావేశం జరిగింది. వక్ఫ్ బిల్లుపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వక్ఫ్ బిల్లుపై చర్చలో పాల్గొనడకుండా తప్పించుకోవడానికి ప్రతిపక్షాలు వాకౌట్‌ను ఓ సాకుగా చెబుతున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. బుధవారం వక్ఫ్ బిల్లుపై చర్చించడానికి కేంద్రం 8 గంటల సమయం ఇచ్చింది. ఇవాళ లోక్‌సభ ముందుకు వక్ఫ్‌బిల్లు రానున్నట్లు తెలుస్తోంది…
HCUలో నిరసనలు చేస్తుంది విద్యార్థులు కాదు.. విద్యార్థుల ముసుగులో ఉన్న పేమెంట్ బ్యాచ్
బీఆర్ఎస్ పార్టీ పేమెంట్ ఇచ్చి అక్కడ ఒక బ్యాచ్ తో నిరసనలు చేయిస్తుంది – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి……
నరసరావుపేటలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి
బర్డ్‌ఫ్లూతో మృతిచెందినట్టు నిర్ధారించిన ICMR
పచ్చి కోడిమాంసం తినడంతో పాటు..
ఇమ్యూనిటీ తక్కువగా ఉండడమే కారణమని నిర్ధారణ
మార్చి 4న మంగళగిరి ఎయిమ్స్‌లో చేరిన చిన్నారి
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి16న చిన్నారి మృతి
చిన్నారి మరణంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం
మృతిచెందిన చిన్నారి ఇంటి సమీపంలో ఆరోగ్యశాఖ సర్వే
అనుమానిత లక్షణాలున్న వారెవరూ లేరని నిర్ధారణ
పల్నాడులో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి లేదన్న అధికారులు..
*🔹నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజ్‌లో ర్యాగింగ్ కలకలం*
ఫస్ట్ ఇయర్ విద్యార్థిపై లెదర్ బెల్టుతో దాడిచేసిన సీనియర్లు.
గోడ కుర్చీ వేసి తాము ఇచ్చిన టాస్క్ చేయలేదంటూ దాడి.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
ఇవాళ యాంటీర్యాగింగ్ కమిటీతో తల్లిదండ్రులు భేటీ.
*టపాసుల గోదాంలో భారీ పేలుడు?*
గుజరాత్‌లోని దీసా పట్టణానికి సమీపంలోని పటాకుల గోదాములో మంగళవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిం ది. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన 21 మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు దుర్మర ణం చెందగా, ఆరుగురు గాయపడ్డారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం బాయిలర్ పేలడంతో గోదాము పైకప్పు, కొన్ని గోడలు కూలిపోయాయని జిల్లా ఎస్పీ తెలిపారు. అగ్నిమాపక శాఖ వెంటనే మంటలను అదుపు చేసిం దని చెప్పారు. మృతుల కుటుంబాలకు గుజరాత్ సీఎం రూ.4 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పేలుడు తర్వాత గోడౌన్ స్లాబ్ కూలిపోవడంతో ప్రాణనష్టం సంభవించిం దని ఎస్పీ అక్షయ్‌రాజ్ మక్వానా తెలిపారు.
పేలుడుకు గల కారణాన్ని తెలుసుకొనేందుకు ఫోరె న్సిక్ బృందాలు ప్రయత్ని స్తున్నాయన్నారు. ఈ గోదాంలో అక్రమంగా బాణసంచా నిల్వ చేస్తున్నా రని తేలింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేశారు.
డిప్యూటీ ఎస్పీ స్థాయి అధికారి నేతృ త్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీసా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నేహా పంచల్ మాట్లాడు తూ..
గోదాంలో మొదట్లో బాణ సంచా నిల్వ చేసేందుకు లైసెన్స్ ఉందని.. కానీ డిసెంబర్ 31, 2024న గడువు ముగిసిన తర్వాత లోపాల కారణంగా దాన్ని పునరుద్ధరించలేదన్నారు. లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత వారు పునరు ద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
యూనిట్లో సరైన సౌక ర్యాలు లేవని అధికారులు గుర్తించి.. లైసెన్స్ పునరు ద్ధరణ ప్రక్రియ నిలిపివేసి నట్లు తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సహాయ నిధి నుంచి రూ.2లక్షలు, రాష్ట్ర ప్రభు త్వం తరఫున రూ.4లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు.
క్షతగాత్రులకు చెరో రూ.50వేలు చొప్పున ప్రకటించారు. మరోవైపు, మధ్యప్రదేశ్ సీఎం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రం నుంచి కార్మికులు అక్కడ మృతిచెందడంతో వారికి రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రుల కు రూ.50వేలు చొప్పున సాయం ప్రకటించారు.