స్వామి నిత్యానంద బతికే ఉన్నారు: ‘కైలాస’ దేశం ప్రకటన.

వివాదాస్పద స్వామిజీ 47 ఏళ్ల నిత్యానంద చనిపోయారనే ప్రచారాన్ని ఆయన స్థాపించిన ‘కైలాస’ దేశం ఖండించింది. నిత్యానంద బతికే ఉన్నారని, ఆరోగ్యంగానే ఉన్నారని ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన ఏప్రిల్ 2న సాయంత్రం 7 గంటలకు (న్యూయార్క్ కాలమానం) ప్రత్యక్ష ప్రసంగం చేస్తారని వెల్లడించింది. కాగా, హిందూ ధర్మ పరిరక్షణకు నిత్యానంద ప్రాణ త్యాగం చేశారని ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ చెప్పినట్టుగా ఏప్రిల్ 1న వార్తలు వచ్చాయి..

*🔹నిత్యానంద స్వామి రూ.4 వేల కోట్ల ఆస్తులు ఆమెకే?*

*• ఆధ్యాత్మిక గురువు నిత్యా నంద (47) జీవసమాధి అయినట్లు ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ ప్రకటించారు.*

_• ఈ క్రమంలో ఆయన ఆస్తుల సంరక్షణపై చర్చ జరుగుతోంది. నిత్యానందకు వందల కోట్ల విలువైన కైలాస ద్వీపంతోపాటు తిరువణ్ణామలై, బిడది, అహ్మదాబాద్ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ రూ.4వేల కోట్లు ఉంటుందని అంచనా. ఇవన్నీ నిత్యానంద శిష్యురాలు, నటి రంజితకే చెందుతాయని._