సీతమ్మవారికి ‘బంగారు’ చీర
శ్రీ రామనవమి సందర్భంగా పట్టు వస్త్రాలను నేసిన సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు హరిప్రసాద్
https://youtu.be/k-KuDHMEBKg?si=F-xa9zTq4BqtzmlL
పది రోజుల పాటు శ్రమించి పట్టుచీరపై భద్రాద్రి ఆలయ మూలవిరాట్ను నేసిన కార్మికుడు
చీరపై ‘శ్రీరామ రామ రామేతి..’ శ్లోకాన్ని 51 సార్లు వచ్చేలా నేసిన కార్మికుడు
ఒక గ్రాము గోల్డ్ జరీ పట్టుతో నేసిన ఈ ఏడు గజాల చీర బరువు 800 గ్రాములు..
దక్షిణాది అయోధ్య భద్రాచల పుణ్య క్షేత్రం సీతా రాములవారి కళ్యాణ మహోత్సవానికి ముస్తాబైంది. పవిత్ర గోదావరి నదీ ఒడ్డున.. మిథిలా స్టేడియంలో జానకీ రాముల పెళ్లికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. భక్తులకు పంచేందుకు 200 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు ఆలయ అధికారులు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేటలో సీతమ్మ వారికి బంగారు పట్టు చీర తయారయింది. శ్రీ రామనవమి సందర్భం భద్రాచలం సీతారాముల కల్యాణానికి సిరిసిల్ల చేనేత కార్మికుడు పట్టు వస్త్రాలను తయారు చేశాడు..
వన్ గ్రామ్ గోల్డ్ జరి పట్టు దారంతో…
సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు హరిప్రసాద్ పది రోజుల పాటు శ్రమించి పట్టుచీరపై కొంగులో భద్రాద్రి దేవాలయం, మూల విరాట్, దేవతామూర్తులను వచ్చే విధంగా.. చీరా కింది బార్డర్లో శంఖు, చక్ర నామాలు, హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చే విధంగా ప్రత్యేకంగా రూపొందించారు.చీరపై ‘శ్రీరామ రామ రామేతి..’ శ్లోకాన్ని 51 సార్లు వచ్చేలా అద్భుతంగా నేశాడు. వన్ గ్రామ్ గోల్డ్ జరీ పట్టుతో నేసిన ఈ ఏడు గజాల చీర బరువు 800 గ్రాములు. ఏటా సీతారాముల కళ్యాణానికి పట్టువస్త్రాలు నేసే అవకాశం సిరిసిల్ల నేతన్నలకు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి చేనేత కార్మికుడు హరిప్రసాద్ విజ్ఞప్తి చేశారు.