* *🔹టీ20 క్రికెట్.. తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి*..
టీ20 క్రికెట్లో 13,000 పరుగులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లి
ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడుగా రికార్డు సృష్టించిన కోహ్లి
ఐపీఎల్ 18 సీజన్లో ముంబయి ఇండియన్స్ జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘనత సాధించిన విరాట్ కోహ్లీ..
ఐపీఎల్(IPL)లో చరిత్ర సృష్టించారు. ఇవాళ మహారాష్ట్రలోని వాంఖడే మైదానం(Wankhede Stadium) వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతోన్న మ్యాచ్లో కోహ్లీ ఈ ఘతన సాధించారు. టీ20ల్లో 13వేల రన్స్ పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా నిలిచారు. ముంబై బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతిని ఫోర్ కొట్టి ఈ ఫీట్ సాధించారు. మొత్తం 386 ఇన్సింగ్స్లో కోహ్లీ ఈ రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ కంటే ముందు వెస్టిండీస్ ప్లేయర్ కీరన్ పొలార్డ్(13,537), పాకిస్తాన్ ప్లేయర్ షోయబ్ మాలిక్(13,557), ఇంగ్లాండ్ ప్లేయర్ అలెక్స్ హేల్స్(13,610) ఉన్నారు. ఇక వీళ్లందరి కంటే టాప్లో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్(381 ఇన్సింగ్స్లో 14,562) టాప్లో ఉన్నారు.
కాగా, ఐపీఎల్లో ఇప్పటివరకు 256 మ్యాచులు ఆడిన కోహ్లీ.. 8137 పరుగులు చేశారు. ఇందులో 65 ఆఫ్ సెంచరీలు, ఎనిమిది సెంచరీలు ఉన్నాయి. ఇక దేశం తరపున 125 టీ20 మ్యాచులు ఆడారు. మొత్తం 4188 పరుగులు చేశారు. ఇందులో ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.