కర్మకి ఏం చేయాలో తెలుసు, పూనం కౌర్.

చిన్న గాయాలకు ఏమో నగరం అంతా ఉలిక్కి పడుతోంది.. పెద్ద నేరాలు జరిగినప్పుడు మాత్రం మౌనంగా ఉంటోంది...!

సీనియర్ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో స్టార్ హీరోల సినిమాలలో నటించి అందరిని మెప్పించింది పూనమ్ కౌర్..అయితే ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమయ్యారు హీరోయిన్ కౌర్. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్న పూనమ్ కౌర్… తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదాస్పద పోస్ట్ పెట్టి… రచ్చ చేస్తూ ఉంటారు.

ముఖ్యంగా టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి.. పరోక్షంగా పోస్టులు పెడతారు పూనమ్ కౌర్. నెలలో కనీసం ఐదు సార్లైనా ఆ ఇద్దరు స్టార్లను.. టార్గెట్ చేసి పోస్టులు పెడతారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మరో వివాదాస్పద పోస్ట్ పెట్టారు పూనమ్ కౌర్. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు… మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

సింగపూర్ లో ఉన్న మార్క్ శంకర్… స్కూలుకు వెళ్లిన సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మార్క్ శంకర్ కాళ్లు అలాగే చేతులు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఉపదితులలోకి పొగ వెళ్ళినట్టు… స్వయంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ కుమారుడు ఆపదలో ఉన్న నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు అలాగే వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు కేటీఆర్ లాంటి రాజకీయ నాయకులు కూడా.. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని… చెబుతున్నారు. అయితే పూనం కౌర్ మాత్రం.. వివాదాస్పద ట్వీట్ చేశారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు.. కర్మకి ఏం చేయాలో తెలుసు అంటూ పోస్టులు ఆమె చేయడం జరిగింది. ఇక ఆ వెంటనే… చిన్న గాయాలకు ఏమో నగరం అంతా ఉలిక్కి పడుతోంది… పెద్ద నేరాలు జరిగినప్పుడు మాత్రం చాలా మౌనంగా ఉంటున్నారు అంటూ చురకలంటించారు. అయితే పూనం కౌర్ చేసిన పోస్టు… ఇప్పుడు వివాదంగా మారింది.

చిన్న గాయాలకు ఏమో నగరం అంతా ఉలిక్కి పడుతోంది.. పెద్ద నేరాలు జరిగినప్పుడు మాత్రం మౌనంగా ఉంటోంది.. ఎవ్రీథింట్ అబౌట్ బెనిఫిట్స్ అంటూ బ్రోకెన్ హార్ట్ ఎమోజీని షేర్ చేసింది. అసలు పూనమ్ కౌర్ ఇలాంటి పోస్టులు అలాంటి టైంలో ఎందుకు పెడుతోంది? ఆమె ఉద్దేశం ఏంటి? అన్నది మాత్రం అర్థం కావడం లేదు. గతంలోనూ ఇలానే ఆమె పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల మీద పరోక్షంగా ట్వీట్లు పోస్టు చేస్తూనే ఉన్నారు….బెత్తం దెబ్బలు అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్‌ను వాడి పూనమ్ కౌర్ సెటైర్లు వేసింది. రాజకీయ నాయకుడు అంటే అలా ఉండాలి.. ఇలా ఉండాలి అంటూ కౌంటర్లు వేస్తూ ఉండేది. ఇక రీసెంటుగా అయితే ఏకంగా త్రివిక్రమ్ పేరు పెట్టి నేరుగానే ట్వీట్లు వేస్తోంది పూనమ్ కౌర్. కానీ ఇంత వరకు ఎక్కడా కూడా తనకు జరిగిన అన్యాయం ఇదీ అని నోరు విప్పి చెప్పినట్టుగా కనిపించడం లేదు..