కారు బోల్తా ముగ్గురు గాయాలు… ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అంటు గ్రామస్తుల ఆరోపణ..!

*సూర్యాపేట జిల్లా*

మేళ్లచెర్వు మండలం కందిబండ గ్రామం సమీపంలో ఉన్న బ్రిడ్జ్ గతంలో కురిసిన వానలకు కోట్టుకు పోయింది…

బ్రిడ్జ్ నిర్మాణపనులు కొనసాగుతున్న బ్రిడ్జ్ పక్కాగా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసి రాకపోకలు సాగిస్తున్నారు…..

సర్వీస్ రోడ్డు పక్కన పెద్ద గుంటలు కాలువ ఉన్న ఆర్ & బి అధికారులు కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చెయ్యక పోవడంతో కొన్నాళ్ళ క్రితం ద్విచక్ర వాహనా దారులు గుంటలో పడి చనిపోయారు….

హైదరాబాద్ నుండి కందిబండ బంధువులు ఇంటికి వచ్చిన వారు తెల్లవా రుజామున కందిబండ నుండి మేళ్లచెర్వు వెళ్లుచుండగా ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న గుంటలో పడి పోవడంతో ముగ్గురు స్వల్ప గాయలతో బయట పడ్డారు ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడం తో ఈ ఘటన జరిగినట్లు గ్రామస్తులు తెలియజేసారు….