నేటి పంచాంగం…నేటి మాట…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌸పంచాంగం🌸
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 12 – 04 – 2025,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
చైత్ర మాసం,
శుక్ల పక్షం,

తిథి : *పూర్ణిమ* తె4.22 వరకు,
నక్షత్రం : *హస్త* సా5.10 వరకు,
యోగం : *వ్యాఘాతం* రా7.53 వరకు,
కరణం : *భద్ర* మ3.26 వరకు,
తదుపరి *బవ* తె4.22 వరకు,

వర్జ్యం : *రా2.00 – 3.46*
దుర్ముహూర్తము : *ఉ5.48 – 7.27,*
అమృతకాలం : *ఉ10.35 – 12.20,*
రాహుకాలం : *ఉ9.00 – 10.30,*
యమగండం : *మ1.30 – 3.00,*
సూర్యరాశి : మీనం,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 5.49,
సూర్యాస్తమయం: 6.10,

*_నేటి మాట_*

*చైత్ర పూర్ణిమ*
చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవం అంటారని పెద్దలు చెప్తారు.
పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాశర మహర్షి చెప్పారు.

శ్రీ రాముడి సీతామాతతో కలిసి అయోధ్యను చేరుకున్నాక, లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమయేనని రాముడు ప్రకటించి, చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారట.

_అదేగాక ఇంకో కధనం కూడా ఉంది_…
చైత్రపూర్ణిమ నాడు ఆంజనేయస్వామి వారి అసురసంహారం చేయడం మూలంగా దీన్ని ఘనంగా, హనుమాన్ విజయోత్సవంగా జరుపుతారట.

ఈ చైత్ర పూర్ణిమ నుంచి వైశాఖ బహుళ దశమి వరకు 40 రోజుల పాటు హనుమాన్ మండల దీక్షను చేపడతారు…
కఠిన బ్రహ్మచర్యం మొదలైన నియమాలు పెట్టుకుని, నిత్యం ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తారు.
అంత కఠిన నియమాలు పాటించకున్నా, మనం కూడా నిష్ఠగా ఈ మండలం రోజులు నిష్ఠగా ఒక్కసారి లేదా 5 సార్లు చాలీసా పారాయణ చేస్తామని సంకల్పం చెప్పుకోవచ్చు.
జాడ్యం, బద్దకం, నిర్లిప్తత, తమస్సు మొదలైన గుణాలు పెరిగిపోయాయి, అవన్నీ వదలాలంటే, తప్పకుండా ఆంజనేయ స్వామి వారిని వేడుకోవాలి.
అప్పుడే మనలో చైతన్యం ఉట్టిపడుతుంది, జడత్వం నశిస్తుంది.
కనుక సనాతన ధర్మ పునర్వైభం, భారతదేశ సంరక్షణ, ప్రపంచ శాంతి, దుష్ట శిక్షణా, అనేవి సంకల్పాలుగా చేసుకుని, అందరూ కూడా ఈ 40 రోజుల పాటు ఇంట్లోనే హనుమాన్ చాలీసా పారాయణ చేయవచ్చు.
మన కోసం చేసిన పూజ కంటే, పదిమంది మేలు కోరి చేసింది, మరింత ఫలితం ఇవ్వడమే కాదు, మనకు శీఘ్ర ఫలాన్ని, రక్షణను, కామ్యసిద్ధిని, కార్యసిద్ధిని ఇస్తుంది.

ఓం శ్రీ హనుమతే నమః
శ్రీ రామదూతం శిరసా నమామి
జై శ్రీ రాం…
రామ లక్ష్మణ జానకీ జై
బోలో హనుమాన్ కీ జై…

*_🌸శుభమస్తు🌸_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏