పాకిస్తాన్ సూపర్ లీగ్ 10వ సీజన్ ప్రారంభమైంది. రెండు రోజుల్లో 3 మ్యాచ్లు జరిగాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్ IPLతో పాటు ఈ టోర్నమెంట్ నిర్వహించడం పీఎస్ఎల్ (PSL) చరిత్రలో ఇదే మొదటిసారి…మరోసారి రెండు లీగ్ల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం మ్యాచ్లు లేదా లేదా లీగ్లో వెచ్చస్తోన్న డబ్బుల గురించి మాత్రమే కాదు.. పీఎస్ఎల్ కూడా ఐపీఎల్తో పోటీ పడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే, తాజాగా కరాచీలో జరిగి ఓ మ్యాచ్లో వింత అనుభవం ఎదురైంది. దీంతో నెటిజన్లు అంతా ఏకిపారేస్తున్నారు.
పీఎస్ఎల్ 10వ సీజన్ ఏప్రిల్ 11 శుక్రవారం నుంచి రావల్పిండిలో ప్రారంభమైంది. శనివారం, లీగ్ మూడవ మ్యాచ్ కరాచీ కింగ్స్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగింది. రెండు జట్ల నుంచి పరుగుల వర్షం కురిసింది. 450 కంటే ఎక్కువ పరుగులు వచ్చాయి. కానీ, ఈ మ్యాచ్ చూడటానికి స్టేడియంలో కేవలం 5000 మంది అభిమానులు మాత్రమే ఉన్నారు. ఇది PSL ప్రజాదరణను ప్రభావితం చేసింది.