🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🥀పంచాంగం🥀
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 17 – 04 – 2025,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
చైత్ర మాసం,
బహుళ పక్షం,
తిథి : *చవితి* మ12.00 వరకు,
నక్షత్రం : *జ్యేష్ఠ* తె5.02 వరకు,
యోగం : *వరీయాన్* రా10.02 వరకు,
కరణం : *బాలువ* మ12.00 వరకు,
తదుపరి *కౌలువ* రా12.35 వరకు,
వర్జ్యం : *ఉ9.08 – 10.52,*
దుర్ముహూర్తము : *ఉ9.54 – 10.44,*
మరల *మ2.52 – 3.42,*
అమృతకాలం : *రా7.31 – 9.14,*
రాహుకాలం : *మ1.30 – 3.00,*
యమగండం : *ఉ6.00 – 7.30,*
సూర్యరాశి : మేషం,
చంద్రరాశి : వృశ్చికం,
సూర్యోదయం : 5.48,
సూర్యాస్తమయం: 6.11,
*_నేటి మాట_*
*తీర్ధయాత్రలలోని పరమార్థం*
చాలా మంది ఈరోజుల్లో ఎన్నో తీర్థయాత్రలు సలుపుతుంటారు, కానీ ఎందుకు చేయాలి?? – దానిలోని అంతరార్థం తెలుసుకున్నప్పుడే ఫలితం కూడా పొందటం సులభతరం అవుతుంది…
ఒకసారి పాండవులు తీర్ధయాత్రలకు వెళుతూ కృష్ణుణ్ణి కూడా తోడు రమ్మని పిలుస్తారు.
సాక్షాత్తు భగవంతుడైన కృష్ణునికి తీర్ధయాత్రల అవసరం ఏముంది? ఆ సంగతి మాయామోహితులైన పాండవులకు తెలియదు.
కనుక కృష్ణుని కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్ధయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారు.
ఆయన ఒక చిరునవ్వు నవ్వి వారికొక *దోసకాయ* నిచ్చి ‘నా ప్రతినిధిగా దీనిని తీసుకువెళ్ళి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనిని ముంచండి, ‘అని చెబుతాడు.
వారు అలాగే చేసి తీర్ధయాత్రలు ముగించి తిరిగి వస్తారు.
అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింపచేస్తాడు కృష్ణుడు…
ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది.
‘అదేంటి బావా?ఇది చేదు దోసకాయ.
కటికవిషంలాగా ఉంది.
ఇలాంటి వంటకం చేయించావేమిటి?’ అని వారు అడుగుతారు!!.
దానికి కృష్ణుడు నవ్వి, ‘ బావా!! … ఎన్ని గంగలలో మునిగినా ఈ దోసకాయ చేదు పోలేదు చూచావా?’ అంటాడు.
ఎన్ని తీర్ధయాత్రలు చేసినా, మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పూ రాదని కృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు.
“ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం”.
మనిషి ప్రయాణం బయటకు కాదు, లోపలకు జరగాలి…
యాత్ర అనేది బయట కాదు, అంతరిక యాత్రను మనిషి చెయ్యాలి, ప్రపంచమంతా మనిషి తిరిగినా చివరకు ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు…
అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలోనుంచి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు.
పాతకాలపు మహర్షులు దేశాలు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదు…
ఒకచోట స్థిరంగా కూచుని తపస్సు చేశారు, జ్ఞానసిద్ధిని పొందారు.
*_🥀శుభమస్తు🥀_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏