సీనియర్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి(Mithun Chakraborty) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బెంగాల్లో శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బ తిన్నాయని, ప్రభుత్వం విఫలమైంది కాబట్టి రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు…బెంగాల్లో రాష్ట్రపతి పాలన(President Rule) విధించాలని కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశా. ఇప్పటికీ కేంద్ర హోం శాఖను అదే కోరుతున్నా. కనీసం ఇప్పుడైనా స్పందించి సైన్యాన్ని దించండి. అప్పుడు ఇక్కడ ఎన్నికలు సజావుగా జరుగుతాయి” అని అన్నారాయన. తాజాగా వక్ఫ్ చట్టాన్ని(Waqf Bill) వ్యతిరేకిస్తూ ముర్షిదాబాద్లో జరిగిన అల్లర్లపై స్పందించిన ఆయన.. ఇలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చ ఏడాది మార్చి-ఏప్రిల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది..ఇదిలా ఉంటే.. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 8-12 తేదీల మధ్య షంషేర్గంజ్, సూటి, ధులియాన్, జంగిపూర్ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ముగ్గురు మరణించగా.. వందల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉద్రిక్తతల వేళ భారీగా కేంద్ర బలగాలను మోహరించాల్సి వచ్చింది. మరోవైపు.. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించొద్దన్న సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తిని ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ పట్టించుకోలేదు. మాల్దా క్యాంప్లలో ఉన్న బాధిత కుటుంబాలను కలిసి ఆయన మాట్లాడారు. మరోవైపు.. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహాట్కర్ నేతృత్వంలోని బృందం సైతం రిలీఫ్ క్యాంప్లలో పర్యటించింది..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.