హీరో మహేష్ బాబుకు ED నోటీసులు…

*📢Breaking News💥*

*🔹హీరో మహేష్ బాబుకు ED నోటీసులు.*

_• సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో నోటీసులు జారీ చేసిన ED_

_• ఈనెల 27న విచారణకు రావాలనీ నోటీసులో పేర్కొన్న ED._

_• ప్రమోషన్ కింద 3.4 కోట్లు తీసుకున్నట్లు మహేష్ బాబు పై అభియోగం.

తెలుగు చలన చిత్ర పరిశ్రమ అగ్ర నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. సూరాణా గ్రూప్, సాయి సూర్య డెవలపర్ ల వ్యవహారంలో అక్రమంగా నగదు లావాదేవీల నేపథ్యంలో ఈడీ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. అంతేకాదు ఈనెల 27న మహేష్ బాబు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఈ యాడ్ ప్రమోషన్ లో భాగంగా మహేష్ బాబు రూ. 3.4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఎలాంటి లావాదేవీలు జరిగినట్టు లేదు. ఈ నేపథ్యంలో మహేష్ బాబును ఈడీ ఆఫీసుకు పిలిపించి విచారించనున్నారు..ముఖ్యంగా మహేష్ బాబుకు రెమ్యునరేష్ కింద ఇచ్చింది మనీ లాండరింగ్ డబ్బులనేది ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే మహేష్ బాబు అండ్ టీమ్ ఈ విషయమై ఎలా స్పందిస్తారనేది చూడాలి. అయితే.. తెలుగులో అత్యధిక యాడ్స్ చేస్తూ రెండు సంపాదిస్తున్న నటుల్లో మహేష్ బాబు ముందు వరసలో ఉంటారు. ఇకపై యాడ్స్ చేసే విషయంలో మహేష్ బాబు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే చెప్పాలి. ప్రెజెంట్ మహేష్ చేతిలో దాదాపు 20కు పైగా బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ ఉన్నాయి. సినిమాల్లో నటించే దాని కన్నా.. ఎక్కువ యాడ్స్ ద్వారా సంపాదిస్తున్నారు మహేష్ బాబు. ఇప్పటి వరకు మహేష్ బాబుకు సంబంధించి టాక్సుల విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగలేదనేది టాక్. ఈడీ నోటీసులపై మహేష్ బాబు స్వయంగా హాజరు అవుతారా.. ఆయన తరుపున ఎవరైనా లాయర్ ను పంపిస్తారా అనేది చూడాలి.

మహేష్ బాబు విషయానికొస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్యాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు పూర్తి స్థాయి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే ఒడిషాలో కీలకమైన షెడ్యూల్ పూర్తైయింది. ఈ సినిమాలో మరో కథానాయికగా కూడా నటిస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటీనటులతో పాటు హాలీవుడ్ కు చెందిన నటులు ఈ సినిమాలో భాగస్వామిగా మారారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది జూలైలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు…