ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు.. ఇవాళ ఢిల్లీలో ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర భేటి

కశ్మీర్‌లో ఉగ్రదాడి నేపధ్యంలో కేంద్రమంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తారు. ఉగ్రవాదుల ఏరివేతపై దిశానిర్దేశం చేయనున్నారు.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, విదేశాంగశాఖ మంత్రి జయ శంకర్ సహా ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై వారిని ప్రధాని మోదీ ఆరాతీశారు. ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు..

హృదయవిదారకం.. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన ఆర్‌ఎస్‌ఎస్‌

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించింది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS). ఈ దాడి అత్యంత దారుణమని, హృదయ విదారకమైనదని ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక నేత దత్తాత్రేయ హోసబాలే పేర్కొన్నారు.

ఇది మన దేశ ఐక్యత, సమగ్రతపై దాడి. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు తమ విభేదాలకు అతీతంగా ఈ ఉగ్రవాద చర్యను ఖండించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ పిలుపునిచ్చింది.

ఇది మన దేశ ఐక్యత, సమగ్రతపై దాడి.

ఈ దాడికి కారణమైన వ్యక్తులకు తగిన శిక్ష విధించేలా చూడాలని తెలిపింది…