జమ్ముకశ్మీర్ కుల్గాంలో ఎన్కౌంటర్. టంగ్మార్గ్లో కొనసాగుతున్న ఎదురుకాల్పులు..
_• TRF కమాండర్ను ట్రాప్ చేసిన బలగాలు. అన్ని వైపుల నుంచి ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు.._
_• పహల్గామ్ ఉగ్రదాడికి కారణం TRF. TRF నాయకుడు ఆసిఫ్ఫౌజీ నేరుగా పహల్గామ్ దాడిలో పాల్గొన్నట్లు గుర్తింపు._
జమ్మూకశ్మీర్ కాల్పులతో మర్మోగింది. కుల్గామ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక సైనికుడు అమరుడయ్యాడు. శనివారం కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఒక సైనికుడు ప్రాణాలు వదిలాడు. ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా బలగాలకు చిక్కి ఉంటారని తెలుస్తోంది. శనివారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక సైనికుడు మరణించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు…ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత కుల్గామ్ జిల్లాలోని మోడెర్గామ్ గ్రామంలో కాల్పులు జరిగాయి. ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు రహస్య స్థావరంలో మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. టెర్రరిస్టులను మట్టుబెట్టే పనిలో భద్రతా బలగాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం రక్షణ శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఇండియాలో 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో పాకిస్థాన్ కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాదులే ఎక్కువగా ఉన్నట్లు రక్షణ శాఖ వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. విదేశీ ఉగ్రవాదులు కాకుండా మరో 17 మంది స్థానిక ఉగ్రవాదులు కూడా చురుకుగా వ్యవహరిస్తున్నట్లు ఇంటెలీజెన్స్ వర్గాలు తెలిపాయి..