కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ యుద్ధ విమానాలు…

*🔹కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ యుద్ధ విమానాలు.*

_• పహల్గాం ఉగ్రఘటన నేపథ్యంలో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సరిహద్దుల వెంట భారీగా సైన్యాన్ని మోహరిస్తుస్తోంది. కశ్మీర్ సరిహద్దుకు ఇప్పటికే యుద్ధ విమానాలు తరలించినట్లు తెలుస్తోంది. PAF విమానాల కదలికను చూపించే ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ నుంచి స్క్రీన్షాట్లను తీసి నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. పాక్ సైన్యం ప్రధాన స్థావరాల్లో ఒకటైన PAF రావల్పిండి నూర్ ఖాన్లో ఉంది.

పహల్గామ్‌ ఉగ్రదాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్ మీడియాకు వెల్లడించారు. అయితే ఈ దాడికి ప్రతీకారం కచ్చితంగా భారత్ తీసుకుంటుంది అని పాక్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఉగ్రదాడితో అలర్ట్ అయిన పాక్.. సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఈ క్రమంలోనే భారత సరిహద్దుల్లోకి పాక్ యుద్ధ విమానాలను మోహరిస్తోందనే వార్తలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇప్పటికే విమానాలు వైమానిక స్థావరాలకు బయల్దేరినట్లు సోషల్ మీడియాలో వాటి ట్రాకింగ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి…

ఇది మన దేశ సరిహద్దు సమీపంలో ఉంటుంది. ఇక ఆ స్క్రీన్ షాట్లలో రవాణా విమానమైన లాక్‌హీడ్ సీ-130 హెర్క్యూలస్, నిఘా కోసం, వీఐపీల తరలింపునకు వాడే ఎంబ్రారర్ ఫోనమ్ 100 జెట్ విమానం కనిపించాయి..