10 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్టు సమాచారం.
వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌కు చెందిన బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ దాడి చేశారు. ఈ దాడిలో కనీసం 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్టు సమాచారం. ఆర్మీ కాన్వాయ్‌లోని ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైపోయింది. కాగా, ఇది బెలూచ్ విప్లవకారుల తాజా యుద్ధ ప్రకటనగా చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీఎల్ఏ స్వయంగా విడుదల చేసింది. ఈ వీడియోలో పేలుళ్లు, కాల్పుల శబ్దాలు, నాశనమైన పాక్ ఆర్మీ వాహనాలు కనిపిస్తున్నాయి.