ఖలిస్తానీ ఎజెండాకు పెద్ద ఎదురుదెబ్బ.. కెనడా ఎన్నికల్లో ఎన్నికల్లో ఘోర పరాజయం…

Canada కెనడాలో 2025 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాజకీయ సమీకరణాలను మార్చడమే కాకుండా ఖలిస్తానీ ఎజెండాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నుకు మద్దతు ఇచ్చిన జగ్మీత్ సింగ్ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశాడు.ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరించి, ఆయన పార్లమెంటు సభ్యుని పదవికి రాజీనామా చేశారు. దీంతో పాటు, అతని న్యూ డెమోక్రటిక్ పార్టీ (NDP) కూడా ఘోర పరాజయం తర్వాత సంక్షోభంలో పడింది.

ఈ ఎన్నికల్లో NDP కి అతి తక్కువ సీట్లు వచ్చాయి. ఆ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీ హోదాను సైతం కోల్పోవచ్చు. కెనడాలో జాతీయ హోదాను నిలుపుకోవాలంటే, ఏ పార్టీ అయినా కనీసం 12 సీట్లు గెలవాలి, కానీ NDP కనీస సీట్లు సాధించడంలో విఫలమైంది. ఇది జగ్మీత్ సింగ్ స్వయంగా ఒకప్పుడు ‘కింగ్ మేకర్’ గా చూపించిన పార్టీ…

జగమీత్ కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. ఓటమి తర్వాత జగమీత్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కెనడా స్థానిక మీడియా ప్రకారం.. ఎన్‌డిపి మొత్తం ఎన్నికల్లో కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలిచింది. జగమీత్ తన సొంత స్థానంలో మూడవ స్థానానికి పడిపోయాడు. దీంతో అతని రాజకీయ జీవితం ముగిసిందనే చర్చ కూడా మొదలైంది.

ప్రారంభ ఫలితాల తర్వాత జగమీత్ కార్యకర్తలతో మాట్లాడారు. “నేను ఉద్యమాన్ని బలహీనపరచలేదు. కానీ ప్రజలు దానిని ఒప్పుకోలేదు. నేను నిరాశ చెందాను, కానీ ఓడిపోలేదు. ముందుకు ప్రయత్నిస్తాను” అని జగమీత్ అన్నారు. జగమీత్ భావోద్వేగంతో తన రాజీనామాను ప్రకటించారు. 2021 ఎన్నికల్లో జగమీత్ పార్టీ 25 స్థానాల్లో గెలిచింది. జగమీత్ పార్టీ ప్రభుత్వంలో కింగ్‌మేకర్ పాత్ర పోషించింది..

ఈసారి జగ్మీత్ సింగ్ కూడా తన సీటును కాపాడుకోలేకపోయాడు. అతను బ్రిటిష్ కొలంబియాలోని బర్నాబీ సెంట్రల్ సీటు నుండి పోటీ చేసి, లిబరల్ పార్టీ అభ్యర్థి వాడే చాంగ్ చేతిలో ఓడిపోయాడు. జగ్మీత్ సింగ్ కు కేవలం 27.3% ఓట్లు మాత్రమే రాగా, విజేత వాడే చాంగ్‌కు 40% కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆయన తన పార్లమెంటరీ నియోజకవర్గంలో మూడవ స్థానంలో నిలిచారని ఫలితాలు స్పష్టం చేశాయి. ఇది జగ్మీత్ సింగ్ రాజకీయ జీవితానికి తీవ్రమైన దెబ్బ. ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన జగ్మీత్ సింగ్, ఫలితాలతో తాను నిరాశ చెందానని, అయితే తన ఉద్యమం పట్ల ఆశావాదంగా ఉన్నానని అన్నారు. “మనం సీట్లు గెలుచుకునేవాళ్ళం, కానీ భవిష్యత్తులో మన పార్టీ మళ్ళీ పుంజుకుంటుందని నమ్మకం ఉంది” అని ఆయన అన్నారు…
ప్రస్తుతం జరిగిన పరిణామంతో ఆ పార్టీ నాయకులు అంతా తల పట్టుకుని కూర్చున్నారు..