నేటి పంచాంగం..నేటి విశేషం…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 30 – 04 – 2025,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
వైశాఖ మాసం,
శుక్ల పక్షం,

తిథి : *తదియ* సా6.23 వరకు,
నక్షత్రం : *రోహిణి* రా8.27 వరకు,
యోగం : *శోభన* మ3.54 వరకు,
కరణం : *తైతుల* ఉ7.29 వరకు
తదుపరి *గరజి* సా6.23 వరకు,
ఆ తదుపరి *వణిజ* తె5.24 వరకు,

వర్జ్యం : *మ12.56 – 2.26*
మరల *రా1.47 – 3.18,*
దుర్ముహూర్తము : *ఉ11.31 – 12.21,*
అమృతకాలం : *సా5.27 – 6.57,*
రాహుకాలం : *మ12.00 – 1.30,*
యమగండం : *ఉ7.30 – 9.00,*
సూర్యరాశి : మేషం,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 5.39,
సూర్యాస్తమయం: 6.14,

*_నేటి విశేషం_*

*అక్షయ తృతీయ*
*సింహాచలం చందనోత్సవం*
*పరశురామ జయంతి*

“అక్షయ” అనగా “ఎప్పటికీ తగ్గదు” అని అర్ధం.
దీనినే అక్తీ తీజ్, అఖా తీజ్ , పరశురామ జయంతి అని కూడా అంటారు.
ఏదైనా శుభ కార్యంఅయినా శుభ లఘ్నము చూడ అవసరము లేకుండా చేయవచ్చు.
_పురాణాలు ఐతిజ్యాలు, నమ్మకముల ప్రకారము ఈ రోజు కొన్ని విశిష్టతలు_

మత్స్య పురాణం 25 అధ్యాయంలో ఈశ్వరుడు పార్వతికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు.
ఆనాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా ఫలితము అక్షయమౌతుంది.
ఇది బ్రహ్మతో కలిసి విశేష పూజనీయమైనది.
అక్షయుడైన విష్ణువు పూజింపబడు దినము..

శ్రీ నారద పురాణం ప్రకారము ఈరోజు చేసే ఘృత, ధేను దానం చేసిన ఫలితం ఇంతింత కాదు, పితరులకు మోక్షము ఇచ్చి, జ్ఞానము ఇచ్చి అవిద్య ఖండించి పరమ వైరాగ్యమును,పరబ్రహ్మమును కలిగించును.

పద్మ పురాణం లో విష్ణువు నారద మహా మునితో ఆదినము గురించి చెప్పాడు.
శివుడి అనుగ్రహంతో సంపదలకు రక్షకుడిగా కుబేరుడు నియమితుడైన రోజు, మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం
ఈరోజు బంగారం కొని లక్ష్మీ దేవిని అలంకరించి పూజ చేస్తారు.
విష్ణు స్వరూపుడయిన పరశురాముడు జన్మించి త్రేతాయుగం మొదలైనది ఈ రోజు.
బలరాముడు జన్మించిన రోజు,
అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజునకు సూర్యుడు అక్షయ పాత్రను ఇచ్చిన రోజు
శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్ర మరల అక్షయము చేసిన రోజు.
కురు సభలో ద్రౌపదికి కృష్ణుడు అక్షయంగా చీరలు ఇచ్చిన రోజు.
మహాభారత కావ్యాన్ని వేదవ్యాసుడు రాయడం ప్రారంభించిన రోజు.
శివుని జటాజూటం నుంచీ భూలోకానికి గంగ చేరిన రోజు,
శ్రీకృష్ణుడు స్నేహితుడైన సుదామాకు అష్ట ఐశ్వర్యాలు కురిపించిన రోజు.
కుబేరుడికి లక్ష్మీ దేవి అనుగ్రహం సిద్ధించిన రోజు.

జైనమత మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు సంవత్సర ఉపవాసం విరమించిన రోజు,
భగీరథుని తపస్సుకు సంతోషించి గంగ భూమిపైకి వచ్చిన రోజు.
యమునోత్రి , గంగోత్రి ఆలయములు తెరవబడు దినము.
ఈ రోజుకు రెండు రోజులకు కేదార్ బదరీనాథ్ లు తెరువబడును.

సింహాచలమున ఈ రోజు మాత్రముననే చందనము ఒలచి నిజ రూప దర్శనము.

పూరీలో జగన్నాధుడు, బలబద్రుడు, సుభద్ర ఉత్స విగ్రహములకు చందన సేవ చేసి జలవిహారము జరుగు రోజు.
పూరీలో జగన్నాధుడు, బలబద్రుడు, సుభద్ర ల మూడు రథముల నిర్మాణము ఆరంభించు దినము …

*నేడు ఆచరించ వలసినవి*

ఈ రోజు చేసే పూజలు, జపాలు అక్షయమైన ఫలితాలనిస్తాయి.
ఈ శుభ తిథిన ఏ పనిచేసినా అది విజయవంతం అవుతుంది.
ఈ రోజు దుర్ముహూర్తాలూ, వర్జ్యాలూ ఉండవు. మొత్తం శుభకార్యాలను జరపించుకోవచ్చు.
పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడంచేస్తుంటారు.
సిరి సంపదలను పెంచుకోవడానికి దానాలు ధర్మాలు విరివిగా చేయాలి, లేని వారికి కావలసిన వస్తువులు అందించడం, ఆకలి గొన్న వారికి ఆహార ధాన్యాలు అందించడం, కూరగాయలు, మజ్జిగ, చల్లని నీరు, చెప్పులు, గొడుగులు ఇత్యాది వస్తువులు దానం చేయడం వల్ల అనంత పుణ్యం కలుగుతుంది,

పరిశుభ్రత చాలా ముఖ్యం. పూజా స్థలం, డబ్బు నిల్వ ఉంచే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలి.

*నిషిద్ధములు:*
పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది .
ప్లాస్టిక్, అల్యూమినియం, స్టీల్ పాత్రలు కొన్న రాహువు ప్రభావితం అయి ప్రతికూలత, పేదరికం వస్తాయి.
డబ్బు అప్పుగా ఇవ్వవద్దు, సిరి సంపదలు కూడా వాని దగ్గరకు పోవును,
నలుపు రంగు దుస్తులను కొనవద్దు,
బంగారం, డబ్బు జాగ్రత్త ..పోవడం చెడు శకునము.
సాయంత్రం చీపురుతో శుభ్రం చేయవద్దు.
ఇంటి గుమ్మం మీద కూర్చోకూడదు.
ఇంట్లో మురికిని ఉంచవద్దు,
దొంగతనం, అబద్ధం జూదం మొదలైన తప్పులు చేయవద్దు.
మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు మొదలైన వాటిని దూరంగా ఉంచండి.
ప్రతికూల ఆలోచనలు, భావోద్వేగాలకు దూరంగా ఉండాలి.
అక్షయ తృతీయ పూజ సమయంలో లక్ష్మీదేవికి తులసి ఆకులను సమర్పించడం అశుభం.

*ధ్యానము…*
అక్షయ తృతీయ రోజున ఈ 5 మంత్రాలను పఠించండి..

1 ఓం నమో నారాయణాయ నమః – విష్ణువుకు అంకితం చేయబడింది.

2 ఓం గం గణపతయే నమః – గణేశుడికి అంకితం చేయబడింది.

3 ఓం మహాలక్ష్మి నమో నమః ఓం విష్ణు ప్రియయే నమో నమః – లక్ష్మీదేవికి అంకితం.

4, ఓం శ్రీ గురుదేవాయ నమః – గురువుకు అంకితం చేయబడింది. జ్ఞానం, తెలివి,మార్గదర్శకత్వం లభిస్తుంది.
5, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్: –
శివునికి అంకితం చేయబడిన ఈ మంత్ర పఠణముచే ఆయురారోగ్యాలు లభిస్తాయి.

పై అంశాలు గ్రంథాలు, పురాణాల, వినికిడిల ఆధారంగా – కొంత తెలుసుకుని రాయడం జరిగినది మాత్రమే!!!…

*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏