*సూర్యాపేట జిల్లా..*
ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్షపడి ఆరేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన బొడ్డు తిరుపతి ని అరెస్టు చేసిన కోదాడ పోలీసులు.
2012 హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుడు తిరుపతి.
2019 ఆగస్టు 17న చర్లపల్లి జైలు నుంచి నెల రోజుల పెరోల్ పై విడుదలై తప్పించుకు తిరుగుతున్న నిందితుడు.
గుర్తింపు మార్చుకుని కుటుంబ సభ్యులకు , స్వగ్రామానికి దూరంగా గుంటూరు లో స్థిరపడిన నిందితుడు.
సూర్యాపేట ఎస్పీ కొత్తపల్లి నర్శింహ్మ ఆదేశాలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గుంటూరు లో అరెస్టు చేసిన కోదాడ పోలీసులు.
నిందితుడిని ఆచూకీ దొరకబట్టుకుని అదుపులోకి తీసుకున్న కోదాడ పోలీసులకు రివార్డు ప్రకటించిన ఎస్పీ నర్శింహ్మ.