నరేంద్ర మోదీ మాకెంతో నష్టం చేశారు..పాకిస్థాన్ నుంచి మోడీకి వార్నింగ్..!

*🔹పాకిస్థాన్ నుంచి మోడీకి వార్నింగ్*

_• భారత్ జరిపిన దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఫ్యామిలీకి చెందిన 10 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే._

_• ఈ ఘటనపై మసూద్ ఫ్యామిలీ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ‘చనిపోయిన వారిలో ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారు. వారందరూ అల్లా దగ్గరకు వెళ్తారని నమ్ముతున్నాం._

_• నరేంద్ర మోదీ మాకెంతో నష్టం చేశారు. ఈ త్యాగం వృథా కాదు._

_• మా వారి అమరత్వం శత్రువుల పతనానికి నాంది పలుకుతుంది. న్యాయం గెలుస్తుంది’ అని పేర్కొంది.._

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో భారత సైన్యం విరుచుకుపడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా దేశంలోని పలు ముఖ్య నగరాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. పంజాబ్‌, రాజస్థాన్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. పోలీసులు, రక్షణ శాఖ వర్గాలతో సమన్వయం చేసుకొని ముందుకుసాగాలని ప్రజలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని యూపీ డీజీపీ సూచించారు.

సురక్షిత ప్రాంతాలకు తరలింపు..

మరోవైపు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రకటించారు. సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు, బంకర్లకు తరలించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. జమ్మూలోని భారత సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు జమ్మూ కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు. సీఎం ఒమర్‌ అబ్దుల్లాతో కశ్మీర్‌లో పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అన్ని భద్రతా చర్యలు కల్పించాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు.