బలూచిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో స్థానిక ప్రజలు పాకిస్తాన్ జెండాను తొలగించి, వాటి స్థానంలో బలూచిస్థాన్ జెండాలు…

ఈ ఉద్రిక్తతల్లో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు.

పాక్ ఆర్మీ ఆడే ఆటలో పావుగా మారొద్దని పాష్‌తూన్ తెగలకు ఎక్స్ వేదికగా ఆయన హెచ్చరించారు. జీహాద్ పేరిట పాక్ ఆర్మీ షాష్‌తూన్‌లను భారత్‌పైకి ఉసిగొల్పే ప్రయత్నం చేయొచ్చని అన్నారు. భారత్, పాక్ మధ్య జరుగుతున్న ఈ రాజకీయ రగడలో ఇరుక్కోవద్దని చెప్పారు. పాక్ పొలిటికల్ గేమ్‌కు తమ పిల్లలను దూరంగా ఉంచాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తాలిబాన్లతో పాక్ విభేదాలు

తాలిబాన్లలో అధిక శాతం పాష్‌తూన్ తెగకు చెందిన వారే. పాక్‌లోని ఖైబర్‌పాఖ్‌తూన్‌ఖ్వా, బలొచిస్థాన్‌లో వీరి ప్రాబల్యం అధికం. 1948, 1999 నాటి భారత్ పాక్ యుద్ధాల్లో పాష్‌తూన్ తెగలు కూడా పాల్గొన్నాయి. పాక్‌కు పాష్‌తూన్‌లు మిత్రులన్న భావన ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో తాలిబన్, పాక్ నేతల మధ్య ఎడం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జయీఫ్ స్టేట్‌మెంట్ కీలకంగా మారింది. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ తమను రంగంలోకి దిగొచ్చని పాష్‌తూన్‌ తెగల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

అప్ఘానిస్థాన్‌లో తమ పరిపాలనను సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉన్న తాలిబాన్‌లు.. భారత్, పాక్ వివాదంలో జోక్యం చేసుకోవద్దనే అభిప్రాయంలో ఉన్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. దక్షిణాసియా ప్రాంతంలో అస్థిరతకు తాము కారణం కావొద్దని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అప్ఘానిస్థాన్‌ పాలకులుగా తమ విశ్వసనీయతను పరిరక్షించుకునేందుకు నిశ్చయించుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే భారత్, పాక్ ఉద్రిక్తతలు అప్ఘాన్ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. వాఘా సరిహద్దు మూసేయడంతో అప్ఘానిస్థాన్‌కు చెందిన అనేక కంటెయినర్‌లు అక్కడే నిలిచిపోయాయి.

భారత్‌పై దాడికి పాక్ మరోసారి ప్రయత్నించి విఫలం అయింది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో పాక్ మిస్సైల్స్ నిర్వీర్యం చేసిన భారత్ పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నేడు నేలమట్టం చేసింది. ఇలా భారత సైన్యం చేస్తోన్న దాడులకు ఉక్కిరిబిక్కిరి అవుతోన్న పాక్‌కు మరో బిగ్ షాక్ తిగిలింది.

పాకిస్తాన్‌ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో స్వాతంత్య్ర పోరాటం మరోసారి తెరపైకి వచ్చింది. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఇందుకు తన కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్‌ ప్రభుత్వానికి మరో కొత్త సవాళు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితిలో ప్రస్తుత పరిస్థితులను బీఎల్ఏ తమకు అనుకూలంగా మార్చుకుంటూ తమకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్‌ను బలంగా వినిపిస్తోంది.

బలూచిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో స్థానిక ప్రజలు పాకిస్తాన్ జెండాను తొలగించి, వాటి స్థానంలో బలూచిస్థాన్ జెండాలను ఎగురవేస్తున్నారు. అంతేకాకుండా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఇదివరకే తమకు ప్రత్యేక దేశం కావాలని పాకిస్థాన్‌ సైనికులపై దాడులు చేసింది. ఒక పక్క భారత ప్రతీకారుల దాడులతో ఒణికిపోతున్న పాకిస్తాన్‌కు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ తమ ఆందోళనతో పాక్‌ను మరింత ఉక్కిరిబిక్కిరి చేసేలా కనిపిస్తుంది..
https://x.com/kedarholic/status/1920457244132458915?t=davTIJRSJ9X7t2GEoGO7zw&s=19