17 నెలల్లో జిల్లాకు కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో ప్రజలు ఆలోచన చేయాలి… కేటీఆర్..

ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో స్వర్గీయ డిసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల శేషగిరిరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

ఈ సందర్భంగా మిట్టపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన కేటీఆర్

🔹కీ. శే రాయల శేషగిరిరావు విగ్రహ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు

🔹ధాన్యం కొనుగోలు జరగడం లేదు

🔹జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు

🔹17 నెలల్లో జిల్లాకు ఏం జరిగిందో ప్రజలు ఆలోచన చేయాలి

🔹కేసీఆర్ ప్రజల కోసం సీతారామా ప్రాజెక్ట్ తెస్తే ఆ నీళ్ళు నెత్తిన జల్లుకునారు కానీ ప్రజలకు ఏమి చేయలేదు

🔹ఉప ముఖ్యమంత్రి భట్టి అఫిడవిట్, నోట్‌లు అబద్ధపు హామీలు అన్ని ఇచ్చాడు

🔹తప్పకుండా ఇచ్చిన హామీని 100 రోజుల్లో చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు

🔹కేసీఆర్ కిట్ అనే పథకం అద్భుతమైన పథకం

🔹కాంగ్రెస్ వచ్చాక ఆ పథకం ఎత్తేశారు

🔹రైతుబంధు గురించి ఆనాడు రెండు పంటలకు ఇస్తావా? అని అడిగిన రేవంత్ నేడు ఒక్క పంటకి కూడా ఇవ్వడం లేదు

🔹రైతు రుణమాఫీ లేదు, షాది ముబారక్ లేదు

🔹వాళ్ళు చెప్పిన ఏ హామీ అయినా నెరవేర్చరా?

🔹మార్పు బాగుందా? మార్పు కావాలని జిల్లా మొత్తం కాంగ్రెస్‌కి ఓటేశారు

🔹కాంగ్రెస్‌ను నమ్మి మంచి మంచి నాయకులను ఓడగొట్టారు

🔹10 ఏళ్ల పాలన చేసిన కేసీఆర్‌ను కాదని కాంగ్రెస్ విసిరిన ఆనందమైన వలలో చిక్కుకున్నారు

🔹6 గ్యారెంటీలు కాకుండా 420 హామీలు ఇచ్చారు

🔹నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూసా

🔹ఎవరూ కూడా రేవంత్ రెడ్డి లాంటి దివాళాకోరు మాటలు మాట్లాడలేదు

🔹ఢిల్లీకి పోతే దొంగలాగా చూస్తున్నారంటున్నా రేవంత్.. దొంగను దొంగాలగే చూస్తారు కదా

🔹 ఢిల్లీలో అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు

🔹అపాయింట్మెంట్ ఇస్తే చెప్పులు ఎత్తుకుపోతాడని అంటున్నారు

🔹జూన్, జులైలో స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారని తెలుస్తుంది

🔹ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజల్లో ఉండాలి

🔹ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో చాటాలి

🔹 ఢిల్లీ పార్టీలను నమ్మొద్దు అని కేసీఆర్ చిలక్కి చెప్పినట్టు చెప్పారు

🔹ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మీకోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే

🔹రాబోయే రోజుల్లో మన ఇంటి పార్టీ మన తెలంగాణ పార్టీని ఆశీర్వదించాలి..